
Ganesh Jayanti 2027 in Telugu
1గణేశ జయంతి 2027
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
గణేశ జయంతి పూజా విధానం (Ganesh Jayanti Rituals)
మాఘ శుక్ల చతుర్థి ని వరద చతుర్థి లేదా గణేశ జయంతి గా జరుపుకుంటాం. ఈరోజు వినాయకుని జన్మదినం. మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో గణేశ జయంతిని విశేషంగా జరుపుతారు.
నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానమాచరించి పసుపు గణపతిని పూజించి, పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి రాత్రికి షడ్రసోపేతమైన విందును ఆరగిస్తారు. సకల విఘ్నాలనూ తొలగించే వినాయక పూజను భక్తులు నేడు శ్రద్ధతో నిర్వహిస్తారు. ఈ రోజు వినాయకుని ప్రార్థించడం వల్ల సంతానం లేని వారికి శీఘ్రమే సంతాన యోగం కలుగుతుంది. కీర్తి సంపదలు ప్రాప్తిస్తాయి.







