Vastu Tips for Your Home | సిరి సంపదలు, సుఖ సంతోషాలు పొందేందుకు ఈ వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించండి.

0
78
vasthu tips
Vastu Principles for a Peaceful Home

Important Vastu Rules for the Home

1ఇంట్లో శాంతి, సౌభాగ్యం కోసం వాస్తు శాస్త్రం ప్రాధాన్యం

మన జీవనశైలిని ప్రభావితం చేయడంలో గృహవాతావరణానికి కీలకమైన పాత్ర ఉంది. ఇల్లు అనేది కేవలం నివాసం కాకుండా, శాంతి, ఆనందం, మరియు సానుకూల శక్తులకు నిలయంగా ఉండాలి. వాస్తు శాస్త్రం, సౌమ్యమైన జీవనాన్ని కొనసాగించడానికి సహజ మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఇది గృహానికి సంబంధించి దిశలు, లేతత్వం, ప్రకృతి శక్తుల సమతౌల్యాన్ని కలిగించి, శ్రేయస్సు మరియు శాంతి అందించేందుకు మార్గనిర్దేశం చేస్తుంది.

సమాజంలో ఉన్న కొంతమంది పండితులు, గృహంలో వాస్తు నియమాలు పాటించడం ద్వారా సకల భోగభాగ్యాలు, సౌఖ్యం కలుగుతాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూల శక్తులు పెంచడం, ప్రతికూల శక్తులను తొలగించడం వంటి ప్రయోజనాల కోసం ఈ నియమాలను పాటించడం అనివార్యం. అటువంటి ముఖ్యమైన వాస్తు నియమాలను గురించి తెలుసుకోవడం ద్వారా, మీ ఇంటిని దైవకటాక్షానికి సమర్థంగా మార్చుకోగలరు.

గృహానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలు

  • ఇతరుల ఇళ్ళలోని వాడకం నీరు, మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు.
  • గృహమందుగానీ, ఖాళీ స్థలమందుగానీ వాయువ్యము మెరక కల్గియున్నట్లైతే వంశవృద్ధి, ఐశ్వర్యము సకల సుఖాలు కలుగుతాయి.
  • పూజ గదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూడాలని ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
  • పడక గదిలో ఓ మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి.
  • పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి.
  • స్తంభ, ప్రతిష్ట చేయడానికి సోమ, బుధ, గురు, శుక్ర వారాలు ఉత్తమం.
  • తూర్పు, ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి.
  • పత్తి, తాటిచెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం.
  • కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కులోని గోడలపై ఉంచరాదు.
  • ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది.
  • ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం.
  • ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది.
  • మనీ ప్లాంట్ ఇంట్లో వుంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులుసూచిస్తున్నారు.మనీ ప్లాంట్ ని కిటికీలు, తలుపులు మెట్లు మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి.
  • ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక, ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. 
  • కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రిచెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.
  • ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి.

ఈ వాస్తు నియమాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో శాంతి, సౌభాగ్యం పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం మరియు సంపద వస్తుంది.

ఇలాంటి మరెన్నో విషయాలు మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.

 

Related Posts

Hanuman Photo Placement Tips | వాస్తు ప్రకారం, హనుమంతుని ఫోటో ఇంట్లో ఏ దిశలో పెట్టాలి?

Vastu tips | నెగిటివ్ ఎనర్జీని తరిమే వాస్తు చిట్కాలు

Vastu tips | ధనాన్ని, సానుకూలతను, సంపత్తిని ఆకర్షించే వాస్తు చిట్కాలు ఇవే !

ఈ కొత్త సంవత్సరం సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సరి! | Vastu Tips for New Year

స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది! | Diwali Vastu Tips

ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ప్రతిష్టించండి | Vastu Tips For Placing Idols in Home