
Ganapati Homam In Kerala
1కేరళలో సీపీఎం కార్యకర్తలు గణపతి హోమం అడ్డుకున్న ఘటన కలకలం రేపుతోంది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
కేరళలోని కోజికోడ్ జిల్లాలోని థొట్టిల్పాలంలోని ఓ పాఠశాలలో గణపతి హోమం నిర్వహిస్తున్న కుటుంబాన్ని సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్న ఘటన కలకలం రేపింది. ఆ పాఠశాల ప్రైవేట్ యాజమాన్యానికి చెందినది. పాఠశాల నిర్వాహకురాలు అరుణ, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమం రాత్రి సమయంలో జరిగింది.
కేవలం వ్యక్తిగతమైన విషయం అని యాజమాన్యం తెలిపింది. అయినప్పటికీ సీపీఎం కార్యకర్తలు రాజకీయ కారణాలతో పూజను అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా నిర్మించిన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కుటుంబపరంగా ఈ పూజ నిర్వహించారు. అయితే, రాత్రి సమయంలో పాఠశాల ప్రాంగణంలో వాహనాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న సీపీఎం కార్యకర్తలు అక్కడికి చేరుకుని పూజా అడ్డుకున్నారు.
ఈ పూజా కార్యక్రమానికి బీజేపీ నాయకులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. పూజా కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, దీనికి ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . కొందరు ఈ ఘటనను మత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా పరిగణిస్తుంటే, మరికొందరు దీనిని రాజకీయ కుట్రగా భావిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది | Pregnant Women Perform Puja
Garuda puranam | గరుడ పురాణం ప్రకారం, ఈ తప్పులు చేస్తే వచ్చే జన్మ ఫలితాలు ఇవే.
Pooja After Having Breakfast | టిఫిన్ చేసాక ఇంట్లో దేవుడి పూజ చేయొచ్చా?
Shiva pradakshna | శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేస్తే ఆరోగ్యం ,అనుగ్రహం కలుగుతుందో తెలుసా!?
Dwadasa Jyotirlingam | భారత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి & వాటి విశేషాలు