నాగమణి ఆ పాము తల మీద ఉందా ! | Nagamani Reality or Myth in Telugu !

0
2265
నాగమణి ఆ పాము తల మీద ఉందా ! | Nagamani Reality or Myth in Telugu !

నాగమణి ఆ పాము తల మీద ఉందంటూ.. ఇంతకూ నిజం ఏమిటంటే..!

సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఏ విషయం.. వైరల్ అవుతుందో అసలు ఊహించలేము. తాజాగా ఓ పాముకు సంబంధించిన వార్త కూడా అలాగే వైరల్ అవుతోంది. ఇక నాగు పాము అంటే హిందూ ధర్మానికి చాలా దగ్గర బంధం ఉంది. ఇక సినిమా వాళ్లకయితే నాగు పాము కొన్ని కోట్ల రూపాయల లాభాలను తీసుకొని వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ ఫొటోలో ఏముందంటే ఓ కుక్క-నాగు పాము..! అయితే ఇలాంటివి మనం చాలానే చూసాం.. కానీ ఈ ఫొటోలో విశేషం ఏమిటంటే..! ఆ పాము తల భాగం మెరుస్తూ ఉండడం. ఆ ఫోటో సోషల్ మీడియాలోకి రాగానే దాని చుట్టూ కట్టుకథలు అల్లారు. ఆ పాము నాగమణిని మోస్తోందంటూ ఇష్టం వచ్చినట్లు చెప్పి వైరల్ చేయడం మొదలుపెట్టారు. కానీ నిజం ఏమిటంటే ఆ పాము మీద సూర్య కిరణాలు పడడం వలన అలా మెరుస్తూ కనిపించింది.ఓ కుక్క చెట్ల మధ్యన పామును గమనించింది. వెంటనే పామును చూసి మొరగడం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లగా.. ఓ పాము పడగ విప్పింది. అప్పుడు పాము మీద సూర్యకిరణాలు పడడం మొదలయ్యాయి. దీంతో ఆ పాము కాస్తా.. అది కూడా పాము పడగ మెరుస్తూ కనిపించింది. అంతే కెమెరాల్లో బంధించగా అపురూపమైన దృశ్యాలు కనిపించాయి. ఇదండీ నిజం.. అంతేకానీ పాము నాగమణిని మోస్తూ అయితే లేదు..! ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని చిక్ మగళూరు జిల్లా కొప్ప తాలూకు హొలే మక్కీ గ్రామంలో జరిగిన ఈ ఘటనను అవినాష్ అనే వ్యక్తి తన మొబైల్ లో బంధించాడు. దాదాపు ఒక గంట పాటూ నాగుపాము-కుక్క మధ్యన ఈ గొడవ జరిగింది. అయితే రెండిటికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here