జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

0
391
Signifiance of pongal
What is the Spiritual & Astrological Significance of Makar Sankranti?!

Astrological Significance of Makar Sankranti

1జ్యోతిష్యశాస్త్రరీత్యా & అధ్యాత్మికపరంగా సంక్రాంతి

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ప్రతి ఒక్కరి తెలుగు వారి సంప్రదాయ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే అతిశయోక్తి కాదు.

సంక్రాంతి పండుగను ఎందుకు & ఎప్పుడు చేసుకుంటారు? (Why & When is Sankranti Festival Celebrated?)

మన దేశానికి వెన్నుముక అయిన రైతులకు వారు పండించిన పంట చేతికి వచ్చిన సమయం కాబట్టి డబ్బులు నిండుగా ఉండటం వల్ల వైభవంగా ఈ పండుగను జరుపుకునే ఆచారం మొదలైంది. ఈరోజు అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి లేని వారికి దానధర్మాలు చేస్తూ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా వారివారి స్తోమతకు తగ్గట్టు జరుపుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం సంక్రాంతి పండుగ.

అధ్యాత్మికపరంగా మరియు జ్యోతిష్యశాస్త్రరీత్యా సంక్రాంతి పండుగ విశేషాలు (Spiritually & Astrologically the Sankranti Festival is Special)

అలాగే అధ్యాత్మికపరంగా మరియు జ్యోతిష్యశాస్త్రరీత్యా చూస్తే ఈ పండుగ చాల శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్య కాలం కాబట్టి. ఉత్తరాయణ కాలం ఎందుకు అంత శుభప్రదం కావడానికి మహాభరతం ప్రకారం ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. స్వంచ్చంద మరణం అనే వరం కలిగిన శంతన కుమారుడు భీష్ముడు కురుక్షేత్రంలో క్షతగాత్రుడై శ్రీకృష్ణుడి సలహామేరకు ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ అలాగే శరముల అంపశయ్యపై నిరేక్షించి మాఘశుద్ధ ఏకదశి రోజున తనువు చాలించాడు. అందుకే ఉత్తరాయణం చాల పుణ్య కాలం అని చెబుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య భగవానుడు సంవత్సర కాలంలో ఆరు నెలలు భూమధ్య రేఖకు ఉత్తరంగాను, ఆరు నెలలు దక్షిణంగాను ఆకాంక్షలు మార్చూతూ సంచరిస్తాడు. ఉత్తర ఆకాంక్షలో సంచరిస్తే ఉత్తరాయణం అని, దక్షిణ ఆకాంక్షలో సంచరిస్తే దక్షిణాయణం అని చెబుతారు. ఉత్తరాయణంలో సూర్యరశ్మి ఆరోగ్య ప్రదాయిని అని పెద్దలు చెబుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం 12 రాశులలో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే సూర్య సంక్రమణం అంటారు. ఇది ప్రతి నాలుగు నెలలకోకసారి జరగదు దీనినే అధిక మాసం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించడాన్ని ఒక్కొక్క సంక్రమణంగా చెబుతారు. వీటిలో సూర్యుడు మకర రాశిలోకి ఉత్తరాయణంలొ ప్రవేశిస్తే ప్రారంభమయ్యేది మకర సంక్రమణం, దక్షిణాయంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే ప్రారంభమయ్యేది కర్కాటక సంక్రామణం. వీటికి ప్రత్యేక విశిష్టత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ఉత్తరాయణంలో ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అని లేదా సంక్రాంతి అని లేదా సంకురాతిరి అని పిలుస్తారు.

సంక్రాంతి సమయంలో వచ్చే ధనుర్మాసం వైష్ణవులకు అత్యంత పవిత్ర మాసం. ఈ నెల రోజులు వైష్ణవులు గోదా సమేతుడైన శ్రీరంగనాథ స్వామిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. ఈమాసంలో మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి వాకిళ్ళలో గోమయం కలిపిని నీళ్ళతో వాకిలిని కల్లార్పి వివిధ రంగులతో ముగ్గులు వేస్తారు. చాల మంది సూర్య రథం ముగ్గు వేస్తారు. సైన్స్ ప్రకారం గోమయం ఔశధ గుణాలు కలిగి ఉండటం వల్ల క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. స్త్రీలు ముగ్గులు వేయటం అనేది కూడా ఒక వ్యాయమంలాగా చేయటం వంటిది కావున వారి ఆరోగ్యం మెరుగుపడి చలికాలం కాబట్టి ప్రతి రోజు మొత్తానికి కావలసిన ఉత్సాహం, శక్తి సమకూరుతాయి.

హేమంత ఋతువులో పగటి సమయం తక్కువగాను మరియు రాత్రి సమయం ఎక్కువగాను ఉంటాయి. ఇంటి ముందు వేసిన ముగ్గులలో కన్నే పిల్లలు గోమయంతో చేసిన గొబ్బెమ్మలను గౌరి దేవిగా భావించి ప్రతిష్ఠించి వాటిని గుమ్మడి పూలతో, బంతి పూలతో మరియు ఆ కాలంలో పూచే అన్ని పుష్పాలతో అలంకరించి పూజిస్తారు.

Related Posts

Bhogi Pallu Significance | బోగి పండ్ల పరమార్థం ఏమిటంటే.?

భోగాల పంట భోగి మంట | Bhogi Festival in Telugu

Makar Sankranti in Telugu | పుణ్యాల పండుగ – మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

Why Should we Worship Bulls on Sankranti in Telugu? | సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి?

https://hariome.com/kanuma-festival-2022/

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య