
What is the Importance of Using Fresh Flowers During Worship or Puja?
1పూజా సమయంలో పుష్పాలు ఎందుకు సమర్పించాలి?!
పూజ చేసే సమయంలో ఏ దేవునికైన పుష్పాలు సమర్పించడం ప్రాచీనకాలం నుండి ఉన్న ఆచారం. పుష్పాలను కచ్చితంగా పూజ సమయంలో స్వామివారికి అర్పించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో భక్తులు పుష్పాన్ని గాని, పండును మరియు జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటి భక్తుల నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తారని గీతలో శ్రీకృష్ణడు చెప్పారు.
భక్తులు దైవాన్ని పరిశుద్ధమైన మనస్సుతో పూజించి అరాదిస్తారో వారిని ఆ దేవుళ్లు వారి వెంటే ఉంటూ కాపాడుతారు. సాక్షాత్తు కృష్ణభగవానుడి తన అర్చన విధానంలో పుష్పాలు సమర్పించడంతో కలిగే ప్రయోజనాలు చెప్పడంతో దేవుళ్లరాధనలో పుష్పాల పాత్ర ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అందుకుగాను పూజ చేసేటప్పుడు పుష్పాలు తప్పనిసరిగా సమర్పించాలి.
పూజకి ఉపయోగించే పుష్పాలు ఎలా ఉండాలి?! (What Should be the Flowers Used for Puja?!)
1. దేవునికి సమర్పించే పుష్పం శుభ్రంగా ఉండాలి.
2. బహిష్టులైన మహిళలు వాటిని తాకరాదు.
3. భూమిపై పడ్డ పుష్పాలను మరియు వాసన చూసిన పుష్పాలను, కడిగిన పుష్పాలు పూజకు వాడకూడదు అని పురాణాలు చెబుతున్నాయి.
4. శుభ్రంగా, స్నానం చేసిన తర్వాత కోసిన పుష్పాలు పూజా సమయంలో ఉపయోగించాలి.
5. ముళ్ళు కూడుకున్న పుష్పాన్ని, విష పూరితమైన పుష్పాల వినియోగించడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
6. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనాలు, మందారం, నీలాంబరం, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, ముని గోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజకు పవిత్రమైనవిగా పండితులు చెబుతున్నారు.
7. చెవిలో పుష్పాన్ని మరియు కంఠాన గంధాన్ని ధరించాలని అలాగే తలలో తులసి దళాన్ని ధరించకూడదు కూడా పండితులు చెబుతున్నారు.
ఏ దేవుడికి ఏ పుష్పాలతో పూజించాలి? (Which God Should be Worshiped With Which Flowers?)
1. సూర్యుడ్ని, వినాయకున్ని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేయాలి.
2. విష్ణు తులసి దళాలతో పూజించాలి.
3. మహాలక్ష్మి అమ్మవారిని తామర పువ్వులతో, ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వలన అమ్మవారు దీవిస్తుంది.
4. గాయత్రి దేవి అమ్మవారిని మల్లిక, పొగడ, కుశ మంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజించాలి.
5. శ్రీచక్రానికి తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాలతో పూజించాలి.
6. పరమ శివునికి మారేడు దళాలతో పూజ చేయడం వలన పరమ శివుడు సంతృప్తి చెంది కోరిన కోరికలు నెరవేరుస్తాడు.
7. పవళ మల్లె పుష్పాలతో పూజ చేయడం వలన భక్తుల కోర్కెలు నెరవేరుతాయని. అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి.
దేవునికి సమర్పించే పుష్పం భక్తి శ్రద్దలతో విశ్వాసంతో సమర్పించాలి. భక్తి లేకుండా పుష్పాలు సమర్పించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అని పండితులు చెబుతున్నారు. దేవునిపై భక్తి ఉన్నవారు మొదటగా దైవాన్ని పుష్పాలతో పూజ చేయాలి. దేవునిపై భక్తి, విశ్వాసాలను ఉంచి, నిష్కల్మషంగా పూజ చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని పురానలు చేపుతునాయి.
Navaratri Related Posts
పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi
Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/