
Krishna Janmashtami Puja Vidhi & Significance
1కృష్ణాష్టమి అంటే ఏంటి? (What is Krishna Janmashtami?)
శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారంగా & శ్రీ కృష్ణుడిలా జన్మించిన పర్వదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి మరియు అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి యొక్క చెరసాలలో జన్మించాడు. కొంతమంది తిధిని బట్టి పండుగను జరుపుకుంటే మరి కొంతమంది నక్షత్రాన్ని బట్టి పండుగను జరుపుకుంటారు.
కృష్ణాష్టమి 2025 తేదీ & ముహూర్తం (Sri Krishna Janmashtami 2025 Date & Muhurt Time)
శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తిథిని ప్రత్యేకంగా జరుపుకుంటారు.
చంద్రమానం: భారతదేశంలో చాలా ప్రాంతాలలో చంద్రమానం ప్రకారం జన్మాష్టమిని జరుపుకుంటారు. అమంత క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం మరియు పూర్ణిమంత క్యాలెండర్‌లో భాద్రపదం మాసంలో వచ్చే అష్టమి తిథిని జన్మాష్టమిగా జరుపుకుంటారు.
ఆంగ్ల క్యాలెండర్: ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, జన్మాష్టమి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఖచ్చితమైన తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. జన్మాష్టమి 2025 లో ఆగస్టు 16, శనివారం రోజున వచ్చింది.
ముఖ్యమైన ముహూర్తాల సారాంశం:
శ్రీకృష్ణుని 5252వ జయంతి
కృష్ణ జన్మాష్టమి, శనివారం, ఆగస్ట్ 16, 2025
నిశిత పూజ సమయం – 23:58 నుండి 00:43, ఆగస్టు 17 వరకు
వ్యవధి – 00 గంటలు 45 నిమిషాలు
ఇస్కాన్ ప్రకారం పరానా సమయం
పరానా సమయం – 06:00, ఆగస్ట్ 17 తర్వాత
రోహిణీ నక్షత్రం లేని జన్మాష్టమి
పరణ దినాన అష్టమి సూర్యోదయానికి ముందే ముగిసింది
మిడ్ నైట్ మూమెంట్ – 00:20, ఆగస్ట్ 17
చంద్రోదయ క్షణం – 23:53 కృష్ణ దశమి
అష్టమి తిథి ప్రారంభం – ఆగస్ట్ 15, 2025న 23:49
అష్టమి తిథి ముగుస్తుంది – ఆగస్ట్ 16, 2025న 21:34
రోహిణి నక్షత్రం ప్రారంభం – ఆగస్ట్ 17, 2025న 04:38
ఆగస్ట్ 18, 2025న రోహిణీ నక్షత్రం ముగుస్తుంది – 03:17
కృష్ణాష్టమి పూజ విధానం (Sri Krishna Janmashtami step by step Puja Vidhi?)
- వేకువజామున ఉదయం: తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.
- ఇంటి శుభ్రత: ఇంటిని మరియు పూజ గదిని శుభ్రం చేయాలి.
- గడప అలంకరణ: గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, తోరణాలు కట్టుకోవాలి.
- పూజ గది అలంకరణ: పూజ గదిలో ముగ్గులు వేయాలి.
- కృష్ణుడి ఆగమనం: కృష్ణుడి పాదాలను గీసి ఇంటిలోకి ఆహ్వానించాలి.
- బాలల అలంకరణ: చిన్న పిల్లలను అందంగా ముస్తాబు చేయాలి.
- కృష్ణుడి అలంకరణ: కృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు ధరించి, ఆభరణాలు అలంకరించాలి.
- తులసి మాల: కృష్ణుడికి తులసి మాలను అర్పించాలి.
- పారిజాత పుష్పాలు: పూజకు పారిజాత పుష్పాలను ఉపయోగించడం మంచిది.
- నైవేద్యం: వెన్నతో సహా ఇతర ప్రసాదాలను అర్పించాలి.
- ఉయ్యాల: కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి లాలి పాటలు పాడాలి.
- ముత్తైదువులకు సన్మానం: ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇవ్వాలి.
- గీతా పఠనం: గీతా పఠనం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
కృష్ణాష్టమి పూజ వలన ఉపయోగాలు (Benefits of Krishnashtami Puja)
1. కృష్ణాష్టమి పండుగ రోజున ఒక పూట భోజనం చేసి, ఆ శ్రీకృష్ణునికి పూజ చేసి, దేవాలయాలు మరియు గౌడీయ మఠములను దర్శనం చేసుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
2. శ్రీ కృష్ణా దేవాలయాలలో కృష్ణ అష్టోత్తర పూజ మరియు కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకున్న వారికి వంశాభివృద్ధి మరియు అష్టైశ్వర్యాలు వారిని వరిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
3. కృష్ణాష్టమి రోజున కన్నయ్యకి పూజ చేయడం వలన సకల పాపాలు తొలగి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి దక్కుతుందని స్కంధ పురాణం చెబుతుంది.
4. కృష్ణాష్టమి పండుగ రోజున బంగారంతో లేదా వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేదా బంగారు పాత్రలలో చంద్రబింబాన్ని పెట్టి పూజ చేయడం వలన మీరు కోరిన కోరికలు అన్ని తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.
5. సంతానం లేని వారు మరియు వివాహం కాని వారు ఈ కృష్ణాష్టమి పండుగ రోజున బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రం తో పూజ చేయడం వలన మంచి జరుగుతుందని అంటున్నారు.
Related Posts
Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?
https://hariome.com/raksha-bandhan-in-telugu/
Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు
వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu
Varalakshmi Vratham Pooja Vidhanam | వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు?
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant