
The Mystery of Sita’s Birth in Telugu
1సీతా దేవి జన్మ రహస్యం
సీతాదేవి తండ్రి జనక మహారాజు యాగము చేసి భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెద్ద పెట్టి అడ్డం పడింది. తెరిచిన పెట్టిలో ఒక పసిపిల్ల కనిపించింది. భూమిలో లభించనందున ఆమెకు ‘సీత’ అని నామకరణము చేశారు తల్లి సునయన, తండ్రి జనక మహారాజు. ఆ తర్వాత అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. సీతాదేవి పుట్టిన జన్మ నక్షత్రం ఆశ్లేష. పురాణాల ప్రకారం సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం అని, సీత దేవి గర్భమున జన్మించలేదు గనుక “అయోనిజ” అని అంటారు. సీతాదేవి జన్మించిన ప్రాంతం ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్.
సీతాదేవి పూర్వ జన్మ (Sita Previous Birth Story)
సీతాదేవికి పూర్వ జన్మ కూడా ఉంది. ఆ జన్మలో సీత దేవి పేరు వేదవతి. సీత దేవి తల్లితండ్రులు కుశధ్వజుడు, మాలావతి. అసలు సీతా దేవి కి వేదవతి అని పేరు ఎలా వచ్చింది అంటే సీత జన్మించినప్పుడు వేధ ఘోష విన్పించడం వల్ల వేదవతి అని నామకరణం చేశారు. తండ్రి కుశధ్వజుడు తన కుమార్తెను శ్రీ మహా విష్ణువు ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కుడా శ్రీ మహా విష్ణువు ధ్యానిస్తూ ఉండేది. వేదవతిని ఒక రాక్షసుడు వచ్చి తనతో వివాహము చేయుటకు తండ్రి కుశధ్వజుడు అడిగెను. దానికి ఆయన ఒప్పుకొలేదు. కోపంతో ఆ రాక్షసుడు కుశధ్వజుడుని చంపుతాడు. ఆ మరణ వార్త విని భార్య మాలావతి బెంగతో మరణిస్తుంది.
సీత మరియు రావణుడి మధ్య సంబంధం (Relation Between Sita & Ravana)
తల్లిదండ్రులు మరణించక వేదవతి అడవిలోకి వెళ్లి కఠోర తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు రావణుడు వేదవతిని అక్కడ చూసి వివాహం చేసుకోమని అడుగుతాడు, దానికి అంగీకరించలేదు అని వేదవతిపై చేయి వేశాడు. రావణుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టంలేని వేదవతి తనకు ఉన్న యోగశక్తితో ఒక్క మహా యోగాగ్ని సృష్టించుకొని అందులో దగ్ద మైపోతుంది. అప్పుడు వేదావతి రావణుడుకి ఒక శాపం ఇస్తుంది. తన వల్లే రావణుడు నాశనం అవుతాడు అని.
మరు జన్మలో వేదవతి రావణుడు లంకలో ఒక కమలంలో జన్మిస్తుంది. ఆమెను చూసిన వేద పండితులు, జ్యోతిష్కులు అరిష్టం అని లంకాధిపతి రావణుడుకి చెప్పారు. అప్పుడు ఆ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలోకి వదులుతారు. కొంతకాలానికి ఆ పెట్టే జనక మహారాజుకు దొరుకుతుంది.
Related Posts
శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Sita Ashtottara Shatanama Stotram
శ్రీ సీతా అష్టోత్తరశతనామావళీ – Sri Sita Ashtottara Shatanamavali
Sri Rama Navami Puja Method / Vidh | శ్రీ రామ నవమి పూజ విధానం
మహాశివుని ఎన్ని అవతారాలు! వాటిలో ఎన్ని అవతారాలు ఇంకా ఈ భూమిపై జీవించే ఉన్నాయి?
Lord Shiva Birth Secrets | శివుడు ఏలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు?