
What is meant by Lakshmi kataksham in Telugu
1. లక్ష్మీకటాక్షము
ఈ లోకంలో ప్రతి మనిషి జీవితం సుఖంగా సాగాలంటే కావలసింది సంపద. మానవుని సహజ గుణాన్ని బట్టి ఒక్కరికి ఒక్కొక్క సంపదపై ఇష్టం కలుగుతుంది. అటువంటి సంపదను పొందాలంటే లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా వుండాలి.ఆ కటాక్షమే లేకుంటే సామాన్యుడు నుంచి సామ్రాట్ వరకు ఎవరికీ జీవనము సాగదు.
ఈ కటాక్షము మానవులకే కాదు దేవతలకు కూడా అవసరమే . సమస్త విశ్వానికి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షనలే రక్ష. ఆమె కారుణ్య రూపిణి కనుక మనలను రక్షించటమే తన పని అని భావిస్తుంది.
ఉపనిషత్తులు ఏమని చెబుతున్నాయి?
ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఇలా చెపుతున్నాయి ” కారుణ్య రూపిణి అయిన లక్ష్మీదేవి సాహచర్యం వల్లనే శ్రీమన్నారాయణుడు సర్వరక్షకుడు అవుతున్నాడు” కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కారుణ్యాన్ని అనుసరించే భగవానుడు మనలను రక్షిస్తాడు. మన రక్షణ కోసమే ఆ తల్లి నిరంతరం స్వామిని విడిచి పెట్టక ఉంటుంది. అలా ఎందుకంటే? అనేక అపరాధాలను చేసిన మనలను చూసి కోపించి శిక్షించాలనే స్వామీ తో “ఎందుకీ కోపం? ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరైనా ఉన్నారా? తండ్రే కోపంతో శిక్షిస్తే , వారిని ప్రేమతో మంచి మార్గంలో పెట్టేది ఎవరు?” అని స్వామిని శాంతపరిచి మనకు ఆనందాన్ని కలిగించేందుకే” అని సమాధానం చెపుతున్నారు శ్రీ పరాశరులవారు. కనుక ఆ కటాక్షాన్ని వర్ణించడం బ్రహ్మాదులకు కూడా శక్తి చాలదు.
అమ్మవారి కటాక్షం
ఈ లోకంలో ఉన్నతమైనవి, మంగళకరమైనవి , ప్రకాశించేవి, గొప్పవి, పవిత్రమైనవి, పవిత్రం చేసేవి, అదృష్టం కలిగించేవి అయిన పదార్ధాలన్నీ కూడా ఆ తల్లి యొక్క కటాక్షం కొంచం ప్రసరించడం చేతనే ఏర్పడ్డాయి అందరు మానవులే అయినా వారి వారి కర్మలను బట్టి ఆ తల్లి కటాక్షంలో తేడా వుంటుంది. మనము ఎన్ని తప్పులు చేసినా మనము అమ్మా అని అంటే తన కనుబోమలను వారి వైపు ప్రీతిగా కదిల్చి వారికి ప్రీతి, జ్ఞానం , మంచి వాక్కు, స్తైర్యం , పరిపూర్ణత, కార్యసిద్ధి , సంపదలు అన్నీ పోటీపడి వచ్చేట్లు చేస్తుంది.
ఎంతవారికైనా లక్ష్మీ కటాక్షం కావాలి! కనుక అమ్మా అని పిలిచినా వెంటనే పలికే ఆ అమ్మకు ప్రీతికరమైన శ్రావణ మాసంలో అ చల్లని తల్లిని అర్చించుటకు కృతకృత్యులము అవుదాము.
Related posts
లక్ష్మీదేవి క్షేత్రం..ఎక్కడ వుందో తెలుసా ? | Where is Lakshmi Devi Kshetram Located in Telugu?
లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu
శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు | Lakshmi Devi Sri Phalam Creates Wealth in Telugu
Promoted Content
Dattatreya aaradana yela cheyalo telapandi