శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు | Lakshmi Devi Sri Phalam Creates Wealth in Telugu

0
4346
Lakshmi 1(3)
శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు | Lakshmi Devi Sri Phalam Creates Wealth in Telugu

శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.

శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి.

శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి.శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి.లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే.

నిత్యం శ్రీ ఫలాన్ని పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు.శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.

శ్రీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి.వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీపలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువ్య దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది.స్త్రీలకు ఋతు సమస్యలు,గర్బాశయ సమస్యలు ఉన్న వారు శ్రీపలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి.

“ఓం శ్రీం శ్రియై నమః”అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.

courtesy-https://www.facebook.com/photo.php?fbid=625119897590374&set=a.277513612351006.40864.100002771085199&type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here