కూర్మావతార కథ | Kurma Avatar Story in Telugu

0
16566
kurma avathara
kurma Avatar Story in Telugu

What is the Kurma Avatar Story?

1కూర్మావతార కథ

దూర్వాసుని శాపం

శ్రీ మహావిష్ణుని అవతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. దేవతలు అమరత్వాన్ని పొందక మునుపు దేవదానవుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగేవి. ఒకనాడు దూర్వాసముని స్వర్గాధిపుడైన ఇంద్రునికి అభిమానం తో ఒక పూలమాలను ఇచ్చాడు.

మార్గ మధ్యం లో ఉండగా లభించిన ఆ పూమాలను దేవేంద్రుడు తన ఏనుగు తలపై ఉంచగా ఆ ఏనుగు తల విదిలించి ఆ పూమాలను కాలితో తొక్కివేసింది.

ఇదిచూసిన దూర్వాసుడు దేవేంద్రుని, అతని రాజ్యం లోని వారందరినీ శక్తిహీనులై పొమ్మని శపించాడు. రాక్షసుల ఆగడాలకు తట్టుకునే శక్తి లేని దేవతలు బ్రహ్మ రుద్రులను వేడుకొన్నారు.

వారు, దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణుని దర్శనానికి బయలుదేరారు.

శ్రీ మహావిష్ణుని ఆదేశం

చాక్షుష మన్వంతరంలో వైరాజుకు సంభూతి అనే భార్య ఉండేది. శ్రీ మన్నారాయణుడు వారికి  పుత్రునిగా జన్మించి అజితుడనే పేర ఉన్నాడు.

దేవతలు అజితునికి నమస్కరించి , నారాయణ స్తోత్రం చేయగా, ఆ పరమాత్ముడు సంతసించి వారికి తన నిజస్వరూపంలో సాక్షాత్కారమయ్యాడు.

దేవతలు నారాయణునికి తమ బాధలను విన్నవించగా స్వామి క్షీర సాగర మథనం చేయమని ఆజ్ఞాపించాడు.

సాగర మథనం

మంథర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని దేవదానవులు క్షీరసాగర మథనానికి పూనుకున్నారు.

కానీ ఆ పర్వతం సాగరం లో మునిగిపోసాగింది. ఏం చేయాలో దిక్కుతోచక దేవతలు హరికి మొరపెట్టుకున్నారు.

కూర్మావతారం

దేవతల ప్రార్థన విని శ్రీమహావిష్ణువు లక్ష యోజనముల విస్తీర్ణము, జంబూద్వీపమంతటి వెడల్పు గల వీపు ఉన్న తాబేలుగా అవతరించి పర్వతాన్ని యెత్తి నిలబెట్టాడు.ఆ పర్వతాన్నిమునగనీయకుండా తన వీపుపై మోశాడు.

వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు శ్రీమహా విష్ణువు కూర్మావతారం ఎత్తిన రోజు కనుక కూర్మజయంతిని జరుపుకుంటాం. ఈ రోజున శ్రీమహావిష్ణువుని ప్రార్థించడం వలన  కష్టాలనుంచి బయటపడి సుఖ శాంతులను పొందగలరు.

Related Posts

Kurma Dwadashi 2025 | కూర్మ ద్వాదశి విశిష్టత, ఎందుకు జరుపుకుంటారు? పూజ విధానం?

Sri Kurma Stotram | Sri Koormavatara Stotram

What is the story behind Kurmavathara?

కూర్మావతార కథ | Kurma Avatar Story in Telugu

శ్రీ కూర్మం (తాబేలు) ఇంట్లో ఉండవచ్చునా ? | Can you Pet Tortoise

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here