
5. గృహచికిత్సలు:
- ఉల్లిపాయ రసాన్ని తాజాగా తీసి 3–5 చుక్కలను ఒక టీ స్పూను నీళ్లకు కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి
- వేప బెరడు చూర్ణాన్ని వాయువిడంగాల చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదులో నీళ్లకు కలిపి తీసుకోవాలి
- చిటికెడు ఇంగువను టీ స్పూన్ పట్టికబెల్లం పొడితో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
- వాము పొడిని (2 గ్రాములు), ఉప్పుకి (గ్రాము) కలిపి వేడినీళ్లతో తీసుకోవాలి
- వేపాకుల రసం రెండు చెంచాలు మొతాదుగా అంతే తేనె కలిపి తాగాలి.
- కురసాని వాముకు (పావు చెంచాడు) బెల్లం (తగినంత) చేర్చి చన్నీళ్లతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
- దానిమ్మ చెట్టు పట్టను వలసి కచ్చాపచ్చాగా దంచిన నీళ్లలోవేసి మరగించి కషాయం తయారుచేసి అర కప్పు మోతాదుగా రెండు చెంచాలు నువ్వుల నూనె కలిపి తీసుకోవాలి.
- వాయు విడంగాలను పొడిచేసి పావు చెంచాడు చొప్పున తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసు కోవాలి.
- మోదుగమండ నుంచి రసం పిండి రెండు చెంచాల మోతాదుగా మజ్జిగతో రెండుపూటలా తీసుకోవాలి.
- కంపిల్లంను చిటికెడు తీసుకొని, బెల్లం కలిపి తీసుకోవాలి.
- చండ్ర చెక్కపట్ట, కోడిశపాల పట్ట, వేపచెట్టు పట్టు వస కొమ్ములు, శొంఠి, పిప్పిళ్ళు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెగడవేరు వీటన్నింటినీ సమానభాగాలు తీసుకొని యవకుటంగా (మెత్తగాకాకుండ) దంచి నిల్వచేసుకోవాలి. దీనిని తడవకు పదిగ్రాముల మోతాదుగా కషాయం కాచి రెండుపూటలా వారంపాటు తాగాలి.
Promoted Content