
why we worship the sun
5. సూర్యారాధన ప్రాముఖ్యత
ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు.
సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.
పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి.
మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది.
శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు.
వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు.
ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు.
సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది.
శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.
మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.







