
why we worship the sun
4. సూర్యుడే జ్ఞానానికి ఆది దేవుడు
వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు.
బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు.
Promoted Content







