
why to wash feet before meal
1. అన్నం పరబ్రహ్మ స్వరూపం
“అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది.“ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ కోరికలు ఉండవు” అని చెబుతుంది భగవద్గీత.
పూర్వకాలం నుంచీ వస్తున్న ఆచారం ఏమిటి?
పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన సూక్ష్మక్రిములు భోజన శాలలలోనికి ప్రవేశించేవి కావు. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి మంచినీరు (అర్ఘ్యం) ఇస్తారు. మనుషులకు హానిచేసే సూక్షక్రిములులను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపేడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీటితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా వుండేవి.
ఆరోగ్య పరంగా వాస్తవాలు
చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుంటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రోక్కుతాం. అదే కాళ్ళతో రావటం వల్ల కుటుబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిడ్డలకు మరింత హానికారకం.
Related Posts
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? | Sitting On The Bed to Have Food
భోజనం చేసేటప్పుడు ఈ నియమం పాఠించండి! | Astro Tips While Eating
భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుతుందా! Can Walking After Meal Reduce Diabetics?
భోజనం తరువాత చేయకూడని పనులు | Things not to do after lunch in Telugu
కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని ఎందుకంటారు? | Bhai Dooj 2024 in Telugu
Atla Taddi | అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం
Ashada Masam 2025 | ఆషాఢమాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే!
Mee panchagam bagundi. Andariki share chestunnanu. Gulika ante emiti.
https://hariome.com/what-does-gulika-means/
hello masteru manishi matalu nervadam enti? evaru nerpincharu? u dont know puranalu? expailn that please