పంచాంగం లో గుళిక అంటే ఏమిటి ? | What Does Gulika Means in Panchagam Telugu

0
16594

gulika img

What Does Gulika Means in Panchagam Telugu

What Does Gulika Means in Panchagam Telugu – పంచాంగం లో గుళిక అనేది మనం చూస్తూ ఉంటాము . అసలు ఈ గుళిక అంటే ఏదో ఒక గ్రహమో లేక ఉపగ్రహమో కాదు అది ఒక గణిత బిందువు.

గుళిక కాలం లో ఏదైనా పని చేస్తే రిపీట్ గా చేయడానికి అవకాసం ఉంటుంది కావున ఏదైనా మరలా మరలా  కొనుగోలు  చెయ్యాలి  అనుకొన్నా  బంగారం  వంటివి  కొనుగోలుకు , గృహ నిర్మాణం  వంటి  పనులు చూసుకొనడం మంచిది .

గుళిక అనే బిందువు ప్రశ్న విధానంలో దీని పాత్ర అమోఘం. ఏదైనా సంశయం వస్తే, గులికను నిర్ణయాత్మక బిందువుగా జోతిష్యులు చూస్తారు.

పరాశర హోరలోను, ప్రశ్న మార్గాది ఇతర కేరళ గ్రంథాల లోను దీని వివరాలు ఉన్నాయి.

సరే గుళిక ను చూడాలి అంటే ఒక దిన ప్రమాణం ను 8 భాగాలు చెయ్యాలి. ఆయా భాగాలకు వరుసగా ఆయా దినాధిపతులు నాధులైతారు. ఎనిమిదో భాగం శూన్యం. దానికి అధిపతి లేదు.

ఈ భాగాలలో శని భాగం ఉదయ సమయం గుళిక కాలం అంటారు. అప్పటి లగ్న బిందువును గుళిక బిందువు అంటారు.

అదే రాత్రి జన్మ అయితే కూడా ఇదే విధానం కాని గ్రహ సమయాలు ఆ వార గ్రహం నుంచి ఐదో గ్రహంతో మొదలు పెట్టాలి. గ్రహముల లెక్క వారముల వరుసలోనే వస్తుంది.

ఈ గుళిక అనేది, లగ్నాన్ని గుర్తించటానికి కూడా పనికి వస్తుంది. అయితే లగ్న డిగ్రీలను ఖచ్చితంగా గుర్తించ టానికి ఇతర పద్ధతులు వాడాలి.

లగ్న సంధి లో ఉన్నా, ఏ లగ్నమో తెలియని స్థితిలో ఉన్నా,లగ్నం అనేది గుళిక సహాయంతో ఖచ్చితంగా గుర్తించ వచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here