వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? విశిష్టత & విశేషం ఏమిటంటే?! | Why Lord Ganesha Idol is Immersed in Water

0
826
Why Lord Ganesha Idol is Immersed in Water
Why Lord Ganesha idol is immersed in Water?

Facts About Ganesh Nimajjanam

29 లేదా 11వ రోజు వినాయకుడిని నిమజ్జనం నీటిలో ఎందుకు చేస్తారు? (Why is Ganesha immersed in water on the 9th or 11th day?)

1. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని 11వ రోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా మరియు విలాసమైన జీవితం గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతిని చేసి, అంగరంగా వైభవంగా పూజలు చేసి ప్రజల కోలాహలం హడావిడి నడుమ వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంత గొప్పగా బతికినా వారైన చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడి నిమజ్జనం చేస్తారు.

2. గణపతి పూజ కోసం మట్టి విగ్రహం మరియు పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ మరియు పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే పూజలో భాగంగా మనం గణపతి విగ్రహాన్ని మరియు పత్రాలనూ తాకడం వలన వాటిలోని ఔషధితత్వం మనకి చేరుతుంది. విగ్రహాన్నీ మరియు పత్రాలనూ ఇంట్లో ఉంచడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి కూడా ఆ ఔషధ గుణాలు చేరతాయి. 9 రోజుల పాటు విగ్రహాన్నీ మరియు పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. వినాయక చవితి నాటికి వర్షాలు బాగా పడతాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. వర్ష కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో కూడా నీరుని క్రిమిరహితంగా మారిపోతుంది. అందువల్లనే నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష రుతువులో వస్తాయి. గణపతి ప్రతిష్ట కోసం రంగు విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి మరియు ఆడంబరానికి పెద్ద పీట వేస్తున్నాయి.

3. భక్తితో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది. వినాయక చవితి నాడు భక్తులు పూజలు అందుకుని వారి మాటలను విని వారి కొరిన కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి దారి సముద్రమే మార్గమే అందువలన వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

Related Posts

https://hariome.com/do-ganesh-nimajjan-like-this-you-get-full-puja-benefit/

Balarama Jayanti | శ్రీ బలరామ జయంతి, గమ్మత్తైన జననం, విశిష్ఠత, ఎలా జరుపుకోవాలి?!

ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs

దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

Next