
Shankha Theertham Significance
1. శంఖంలో నీటిని పోస్తే తీర్థం ఎందుకవుతుంది?
తీర్థం ఇచ్చే పద్ధతి
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
అని చంద్రుని, వరుణదేవుని, పృధ్విని , లోకం లోని అన్ని పుణ్యక్షేత్రాలను శంఖం లోని నీటిలోకి ఆవాహన చేస్తారు.
తరువాత ఆకార మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాప క్షయకరం శ్రీ పాదో దకం పావనం శుభం అని ఆ శంకువు లోని నీటిని తీర్థంగా ఇస్తారు.
శంఖం అంటే ఏమిటి ? దాని గొప్పతనమేమిటి?
శం అంటే శుభం/మంచి అని, ఖం అంటే నీరు అని అర్థం. శుభకరమైన నీటిని కలిగి ఉండేది శంఖం అయింది. క్షీరసాగర మథనం లో లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామ ధేనువు మొదలైన వాటితో తో పాటుగా శంఖం ఉద్భవించింది. విష్ణుపురాణం ప్రకారం లక్ష్మీ , శంఖం సముద్ర తనయలు. శంఖానికి పీఠ భాగ లో వరుణ, సూర్య, చంద్రులు ఉంటారు. ఉపరితలం పై ప్రజాపతి ఉంటాడు. గంగా సరస్వతులు శంఖం యొక్క ముందు భాగం లో ఉంటారు. అందుకే శంఖం లోని నీరు సర్వదేవతానుగ్రహాన్నీ కలిగి పవిత్రమవుతుంది.
శంఖం లోని నీటి గొప్పదనం గురించి శాస్త్రీయమైన ఆధారాలు
మొలస్కా జీవులు తమను తాము రక్షించుకోవడానికి తయారు చేసుకునే రక్షణ కవచమే శంఖం. అవి కొద్ది రోజుల తరువాత ఈ కవచాన్ని విడిచిపెడతాయి. మళ్లీ అవసరమైనప్పుడు మరో కవచాన్ని తయారు చేసుకుంటాయి. ఆ కవచాలనే మనం శంఖాలంటున్నాం.
శంఖం కాల్షియం, మెగ్నీషియం,ఫాస్ఫేట్, కార్బొనేట్ లతో తయారవుతుంది. ఇవి ఎముకలు పుష్టిగా ఉండటానికి,మెదడు చురుకుగా పని చేయడానికి,శరీరం లోని మలినాలను తొలగించడానికి, కండరాల సంకోచ వ్యాకోచాలు సరైన పద్ధతిల్లో ఉంచడానికీ చాలా అవసరమైన ధాతువులు. శంఖాలలో ఉండే మెగ్నీషియం మన జన్యువులలోని DNA మరియు RNA లకు అవసరమైన ఎంజైముల తయారీ లో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థను ఇది మెరుగు పరుస్తుంది. శంఖం లో ఇమిడి ఉన్న ధాతువుల ఉపయోగాలు లెక్కకి మించినవి. అందుకే శంఖంలో నీటిని పోసి ఆ నీటిని మంత్రోచ్ఛారణలతో శక్తివంతం చేస్తారు. అప్పుడానీరు మంత్రోచ్ఛారణలలోని దైవీక శక్తినీ, శంఖం లో ఇమిడి ఉన్న ధాతు శక్తినీ కలుపుకుని అత్యంత శక్తివంతమవుతుంది. అటువంటి నీటిని కొద్దిగా తీసుకున్నా విశేష ఫలితాలు ఉంటాయి.
ఇంత శాస్త్రీయత దాగి ఉంది కనుకనే మన సాంప్రదాయకులు శంఖం లో పోస్తేనే అది తీర్థం అని అన్నారు.
Related Posts
శంఖం పూజ గదిలో ఉండవచ్చునా? లేదా? | Can we keep Shankam at home in Telugu?
Weapons of God! | దేవతల చేతిలో ఆయుధాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయి.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple