శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?! Why Buy Gold in Shravana Masam Varalakshmi Vratam

0
1441
Why to buy gold in sravana masam
Why Buy Gold in Shravana Masam Varalakshmi Vratam?

Why Hindu Ladies Buy Gold on the Occassion of Varalakshmi Puja?

1వరలక్ష్మీ అమ్మవారి వ్రతానికి మహిళలు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?

మన భారతీయ మహిళలకు మరియు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఏదైన శుభకార్యం ఉందంటే బంగారం కొనుగోలు చేయడం సంప్రాదయంగా వస్తుంది. అలాగే మహిళలు బంగారం అలంకరించుకుని శుభకార్యలకు వెళుతుంటారు. మన భారతీయ మహిళలు ఎక్కువగా అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తారు అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం రోజున కూడా బంగారం కొనుగోలు చేస్తారు. మన భారతీయ హిందువులకు శ్రావణ మాసం అత్యంత ముఖ్యమైన నెలగా భావిస్తారు. మహిళలకు ముఖ్యంగా ఈ మాసం ప్రత్యేకమైంది. అందుకే ఈ శ్రావణ మాసాన్ని శుభాల మాసం మరియు పండుగల మాసం అని కూడా పిలుస్తారు.

శ్రావణమాసం పూజ విధానం (Shravana Masam Puja Vidh & Rituals)

ఈ మాసమంతా ప్రతి ఇల్లు నిత్యం పూజలతో విరసిల్లుతుంది. అలాగే దేవాలయాలు అన్ని భక్తులతో కలకలలాడుతూ ఉంటాయి. ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే వాయినాల్లో అప్యాయతలు కనపడతాయి. ఒకరికొకరు పసుపు పూసుకోవడం, ప్రసాదాలు మరియు పండ్లు పంచుకోవడం వంటివి కన్నుల విందుగా కనబడుతుంది. ఈ మాసంలో వచ్చే క్రిమికీటకాలు ఇళ్లలోకి రాకుండా గడపలకు రాసే పసుపు ఔషధంగా పని చేస్తుంది.

మహిళలు అసలు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?

ఈ శ్రావణ మాసంలో మంగళవారం మరియు శుక్రవారం అమ్మ వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ప్రధానంగా ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ప్రతి మహిళ వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి దగ్గర బంగారు కాసు పెట్టి పూజలు జరుపుతారు. ఎందుకంటే బంగారాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో సమానంగా చూడటం మన భారతీయుల సంస్కృతి.

దక్షిణాయనంలో వచ్చే శ్రావణమాసం అత్యంత విశిష్టమైనది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రం అందుకే శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు తన భర్త యొక్క పేరు మీద వచ్చిన నెల కాబట్టి అమ్మవారికి ఈ మాసం అత్యంత ప్రీతికరం. అందుకు కారణంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం శుక్రవారం రోజు బంగారాన్ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని హిందువుల నమ్మకం. అందుకే కొంతమంది బంగారం కొనుగోలు చేస్తారు. అలా బంగారం కొనుగోలు చేయలేని వారు ఒక కాసుని లేదా అమ్మవారి రూపుని పంచామృతాలతో శుభ్రం చేసి ఉపయోగిస్తారు.

దాంపత్య అన్యోన్యత కోసం ఇలా చేయండి!!

శ్రీ మహా విష్ణువు మరియు మహాలక్ష్మి అమ్మవారు ఎంత అన్యోన్యంగా ఉంటారో మన అందరికి తెలిసిందే. అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసిన వారి దాంపత్యం జీవితం కూడా అంతే అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేస్తారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భావిస్తారు. అమ్మవారికి వరలక్ష్మి రూపంలో పూజలు చేస్తారు. కొంతమంది కొత్త బట్టలు, బంగారం మరియు ప్రసాదాలు పెట్టి పూజలు చేస్తారు. సౌభాగ్యం, అయురారోగ్యలు ప్రసాదించమని అమ్మవారిని స్మరిస్తారు.

Varalakshmi Related Posts

Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu

Varalakshmi Vratham Pooja Vidhanam | వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు?

శివునికి ఇష్టమైన శ్రావణం మాసంలో ఈ రాశుల వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆశీస్సులు వీరికి సొంతం!? | Lord Shiva Blessings in Shravana Masam

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

శ్రావణమాసంలో శివునికి ఇష్టమైన రాశులివే. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి! | Lucky Zodiacs to Lord Shiva

Sravana Pournami Significance in Telugu? | శ్రావణ పౌర్ణమి ప్రాముక్యత ఏమిటి ?

Sravana Somavaram Pooja in Telugu | శ్రావణ సోమవారం – ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి?

శుభాలనిచ్చే శ్రావణ లక్ష్మీ ? | Virtue of Sravana Lakshmi in Telugu

శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ | Sravana Mangala Gowri Vratham Vidhanam in Telugu

శ్రావణమాసంలో పాటించవల్సిన నియమాలు ఏమిటి ? | Importance of Sravana Masam in Telugu

Kanakadharastavam Stotram In Telugu | కనక వర్షం కురవాలంటే ? శ్రావణ శుక్రవారంనాడు పటించవలిసిన స్తోత్రమ్?