
which side should a lamp face in Telugu
1. దీపం ఏ వైపుకి ఉండాలి?
దీపారాధన శ్లోకం
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదామ్
శతృ బుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే.
భావం: దీపారాధన చేయడం వలన శుభాలు కలుగుతాయి. ఆరోగ్యము, ధనము వృద్ధి చెందుతుంది. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి.
దీపం ఎటువైపు పెడితే ఏ ఫలితం ఉంటుంది?
ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీపారాధనని ప్రతిరోజూ చేయమని సనాతన ధర్మం చెబుతోంది. దీపాన్ని తూర్పు వైపుగా పెడితే ఆరోగ్యం కలుగుతుంది. పశ్చిమం లో దీపం పెట్టడం వలన భక్తి పెరుగుతుంది. ఉత్తరానికి పెడితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. దక్షిణానికి పెట్టడం అశుభము,మృత్యు కారకము. ఇది దీపం ఉండవలసిన దిక్కు.
దీపం ఏ దేవునికి ఎటువైపున ఉండాలి?
భగవంతునికి దీపం ఏవైపు ఉండాలనే నియమం ఉంటుంది. మహా శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడి వైపు దీపాన్ని ఉంచాలి. మధ్యలో దీపాన్ని పెట్టరాదు.
దీపారాధనలో చేయకూడనివి
ఒకే వత్తితో దీపాన్ని వెలిగించరాదు. ఒకసారి వెలిగించిన వత్తిని మళ్ళీ ఉపయోగించరాదు. బైట దొరికే దీపా రాధన నూనెలను అవి వేటితో చేస్తున్నారో పరిశీలించకుండా ఉపయోగించరాదు. దీపారాధనకి ఆవునెయ్యి శేష్ఠం.
Lemon Lamp | నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
కామాక్షీ దీపం గురించి తెలుసా? | Significance of Kamakshi Deepam In Telugu
ఏ దేవుడుకు యే దీపం పెట్టాలి ? | Types of Lamps to be use for Different Gods in Telugu?
Good keep it up
happy to know about it 🙂