
How to Get Rid of Sinus – సైనసైటిస్ తో బాధ పడే వారు తరచూ ఎదుర్కునే సమస్య ముక్కు దిబ్బడ, తుమ్ములు,తలనొప్పి.
వాటిని నివారించాలంటే ఒక స్పూను వాము తీసుకుని నూనె లేని పెనం మీద కొద్దిగా వేయించాలి ( డ్రై రోష్ట్).
వాటిని ఒక శుభ్రమైన వస్త్రం లో చిన్న ముడివేసి మూటలా కట్టి ఎక్కువ సెగ తగలకుండా, వేడి మాత్రం కొద్దిగా తెలిసే విధంగా ముక్కు రంధ్రాల ద్వారా గట్టిగా ఆ మూటని వాసన పీల్చాలి.
మొదటి సారి కొద్దిగా నొప్పి రావడం, కంటినుంచీ నీరు కారడం సాధారణంగా జరుగుతాయి.
నొప్పి గనక తట్టుకోలేనంత గా ఉంటే పీల్చడం ఆపి మంచి నీళ్ళు తాగాలి. అటువంటి వారు వాము మూటను కాస్త దూరం నుంచీ వాసన చూడాలి.
తుమ్ములు అధికం అయితే మరొక సారి ప్రయత్నించకూడదు.
నూటికి తొంభై ఎనిమిది శాతం ఇది అందరికీ పనికివచ్చే చికిత్స. ఇలా వాము వేడి చేసి వాసన పీల్చడం
వల్ల ఇరవై నుంచీ ముప్ఫై సెకన్లలో ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి. సైనస్ వల్ల కలిగే తలనొప్పి కూడా తగ్గుతుంది.