
Best Oils for Deepam and Their Spiritual Significance
దీపారాధనకు ఏ నూనెతో దీపం పెడితే ఉత్తమం?
విజయం కోరే భక్తులు పరమశివుని పూజలో వేపనూనె మరియు ఆవునెయ్యి కలిపి దీపం వెలిగిస్తే, విజయసిద్ధి లభించేది పూర్వీకుల అనుభవం ద్వారా తెలిసిన విశ్వాసం.
అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం సఖ్యంగా మారుతుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనెను ఉపయోగించడం శుభప్రదం.
నూవ్వుల నూనె విశేషమైన శక్తి కలిగినదిగా భావించబడుతుంది. ఇది విష్ణువంశ దేవతలకు ప్రీతికరం. శరీరానికి, మనస్సుకు శుభఫలితాలిచ్చే నూనె. దుష్ఫలితాలను తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తుంది.
ఆవునెయ్యితో దీపారాధన అత్యంత శ్రేష్ఠమైనదిగా భావించబడుతుంది. ఇది సూర్యశక్తిని కలిగి ఉండడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులను ప్రసాదిస్తుంది.
👉 దీపారాధన చేసే ప్రతి సమయంలో వాడే దీపకుండ పరమ పవిత్రతను సూచిస్తుంది.
-
దీపంలో కింది భాగం బ్రహ్మ,
-
మధ్య భాగం విష్ణుమూర్తి,
-
పైన ప్రమిద శివుడు
అని భావించబడుతుంది. -
వత్తి వెలుగు సరస్వతీ దేవిని,
-
విస్ఫులింగం లక్ష్మీదేవిని సూచిస్తుంది.
వెండి కుండితో దీపారాధన అత్యంత విశిష్టమైనది. తర్వాత పంచలోహ కుండి లేదా మట్టి కుండి వాడాలి. స్టీల్ కుండిలో దీపారాధన చేయకూడదు. దీపకుండి కింద ఇంకో చిన్న ప్రమిద తప్పనిసరిగా ఉంచాలి.
Related Posts
Arunachalam Karthika Deepam | అర్ధనారీశ్వరుడి కథలో తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవ ప్రత్యేకత
కామాక్షీ దీపం గురించి తెలుసా? | Significance of Kamakshi Deepam In Telugu
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
ఆకాశ దీపం అంటే ఏమిటి? ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి ? | Akashadeepam in Karthika Masam in Telugu