
Pradosha Pooja Vidhi
గ్రహాపీడా నివారణలకూ, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నావారికీ ఈ శని ప్రదోష సమయం దైవానుగ్రమనే చెప్పుకోవాలి.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్నే “ప్రదోష కాలం” అంటారు. సూర్యుడు అస్తమించే సమయం లో తిథి మారితే అది ప్రదోషకాలం . “ప్రదోషో రజనీ ముఖం” అంటారు. అంటే ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఈ సమయం లో పరమశివుడు పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వర రూపంగా దర్శనమిస్తాడు. ఆనంద తాండవాన్ని చేస్తాడు. ప్రమశివుడు ప్రదోష కాలం లో పార్వతీ సమేతుడై ప్రమధ గణాలతో కొలువై అత్యంత ప్రసన్న మూర్తి గా భక్తులు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేరుస్తాడు. ప్రదోష సమయం లో పూజించిన వారిని గ్రహదోషాలు, ఇతర పాపాలు వ్యాధులనుండీ విముక్తులను చేస్తాడు. కృష్ణపక్ష త్రయోదశి లో ఒచ్చే ప్రదోషాన్ని ‘మహా ప్రదోషము’ అంటారు. శుక్ల పక్ష ప్రదోషం కూడా ప్రత్యేకమైనదే.