What is Tharpanam | తర్పణాలు అంటే ఏమిటి? ఇవి ఎందుకు వదులుతారు? వాటి విశిష్టత ఏమిటి?

0
7391
what is Tarpanam and significance
Tarpanam and significance

what is tharpanam in Telugu

1. తర్పణం అంటే ఏమిటి?

తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.

తర్పణము ఎన్నిరకాలు?

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. 
సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.

ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

  1. గరుడ తర్పణం : ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.
  2. బ్రహ్మ యజ్ఞ తర్పణం : నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.
  3. పర్హెణి తర్పణం : యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.
  4. సాధారణ తర్పణం : అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.   

తర్పణాలు ఎందుకు వదులుతాము?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.

ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.
2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .
3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.
4. ఆవు నేతితో తర్పణము చేస్తే, సుఖము పొందుతారు.
5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, సర్వ సిద్ధి అనుగ్రహం కలుగుతుంది. 
6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే శత్రు నాశనము జరుగుతుంది. 

తర్పణం ఎలా వదలాలి?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను. (అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

Related Stories 

Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం

Gayatri Jayanti 2025 | గాయత్రీ జయంతి తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, కథ, వేడుకలు మరియు పఠించాల్సిన స్లోకాలు

Kurma Jayanthi 2025 | కూర్మ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

Gopashtami | కోరికలు నెరవేర్చే గోమాత పూజా విధానం, విశిష్టత

Sheetala Saptami 2025 | శీతల సప్తమి తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here