Why to Buy Gold on Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుంది? ఏమి చేయాలి? ఎందుకు చేయాలి?

0
18776
Why to Buy Gold in Akshaya Tritiya
 Akshaya Tritiya 

Why to Buy Gold on Akshaya Tritiya in Telugu

1కృత యుగాది అక్షయ తృతీయ

అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున శ్రీ మహా విష్ణువు పరశురామావతారాన్ని ధరించాడని పురాణ ప్రతీతి. ఈ రోజున రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభాకార్యాన్నైనా జరుపుకోవచ్చని పురోహితులు చెబుతారు. నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. బదరీనాథ్ లోని ఆలయాన్ని ఇవాళ తెరిచి ఉంచుతారు. ఇలా అన్నిరకాలుగా వైశిష్ట్యం ఉన్న రోజు అక్షయ తృతీయ.

అక్షయ తృతీయ పేరు ఎలా వచ్చింది? (How did the Name Akshaya Tritiya Come About?)

శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ప్రతిదీ ఆయన ఇల్లాలైన మహా లక్ష్మికి కూడా ప్రీతికరమే. శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ చేసే పూజలు, పుణ్య కార్యాలు, ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజున అందరూ తమ శక్తి మేరకు జప దానాలు చేయాలని శాస్త్ర వచనం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఆ దేవదేవుడికి అపారమైన భక్తితో, అచంచలమైన విశ్వాసంతో ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలు. ఈ పుణ్య ఫలం జన్మ జన్మలకు తోడూ నిలుస్తుంది. క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

అక్షయ తృతీయ రోజున ఏమి చెయ్యాలి? (What to do on Akshaya Tritiya?)

మామూలుగా అక్షయ తృతీయ అనగానే అందరికీ బంగారం గుర్తుకు వస్తుంది. ఇవాళ చేసిన పని ఏదైనా శాశ్వతంగా ఉండిపోతుంది అన్న మాటను బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనడంలా అర్థం చేసుకుని అవే పాటిస్తున్నారు ప్రజలు. దీనికి అసలైన అర్థం అక్షయ తృతీయ రోజున ఎటువంటి పుణ్య కార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది అని. అక్షయ తృతీయనాడు పొద్దున్నే లేచి, స్నానాదికాలు ముగించుకుని, అక్షతలను శ్రీ మహా విష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. తరువాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి, మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తరువాత వచ్చే 12 మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలం లభిస్తుంది.

అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు? (Why buy gold on Akshaya Tritiya?)

అక్షయ తృతీయ నాడు ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని నమ్మిక. అక్షయ తృతీయ శ్రీ మహా విష్ణువుకు మరియు మహా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు.

అక్షయ తృతీయనాడు చేయకూడనివి ఏమిటి? (What should not be done on Akshaya Tritiya Day?)

శ్రీ మహా విష్ణువుకు, శ్రీ మహా లక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఎటువంటి పాప కార్యములు గాని, చెడు ఆలోచనలు కానీ చేయకూడదు. ఈ రోజున చేసిన ఎటువంటి పని అయినా దాని ఫలితము అక్షయము కాబట్టి, పాపకార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మజన్మలకూ వెంటాడుతుంది.

శక్తి కొలదీ మాత్రమె దానము చెయ్యాలి, ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానమును చేయరాదు.

అక్షయ తృతీయ నాడు ఏవైనా జీవితానికి పనికివచ్చే కొత్త విషయాలు నేర్చుకోవడం మానరాదు.

ఎవరిమీదకూడా కోపం మరియు ద్వేషం చూపించరాదు.

2025 అక్షయ తృతీయ నాడు బంగారం ఏ సమయంలో కొనాలి? (Auspicious Timings to Buy Gold on Akshaya Tritiya 2024?)

అక్షయ తృతీయ, బుధవారం, ఏప్రిల్ 30, 2025

అక్షయ తృతీయ పూజ ముహూర్తం – 05:51 నుండి 12:13 వరకు
వ్యవధి – 06 గంటలు 23 నిమిషాలు

తృతీయ తిథి ప్రారంభం – ఏప్రిల్ 29, 2025న 17:31
తృతీయ తిథి ముగుస్తుంది – ఏప్రిల్ 30, 2025న 14:12

ఇతర నగరాల్లో అక్షయ తృతీయ ముహూర్తం:

06:08 నుండి 12:32 వరకు – పూణే
05:41 నుండి 12:18 వరకు – న్యూఢిల్లీ
05:49 నుండి 12:06 వరకు – చెన్నై
05:49 నుండి 12:24 వరకు – జైపూర్
05:51 నుండి 12:13 వరకు – హైదరాబాద్
05:42 నుండి 12:19 వరకు – గుర్గావ్
05:40 నుండి 12:20 వరకు – చండీగఢ్
05:05 నుండి 11:34 వరకు – కోల్‌కతా
06:11 నుండి 12:36 వరకు – ముంబై
05:59 నుండి 12:17 వరకు – బెంగళూరు
06:07 నుండి 12:37 వరకు – అహ్మదాబాద్
05:41 నుండి 12:18 వరకు – నోయిడా

జై మాతంగి మా _/\_

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Posts

అక్షయ తృతీయ నాడు ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ? | What Should We Donate on Akshaya Triteeya in Telugu

9 Things To Donate On Akshaya Tritiya

What is Akshaya Tritiya? | Akshaya Tritiya 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here