గుడిలో ప్ర‌ద‌క్షిణ చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనక భాగాన్ని తాక‌కూడ‌దా? అలా చేయడం వలన జరిగే పరిణామాలు ఏమిటి? | Why Shouldn’t We Touch Backside of The Temple During Pradakshina?

0
2103
Why should we not tough Garbha Gudi back side
Why Shouldn’t We Touch Backside of The Temple During Pradakshina?

We Should Not Touch Garbha Gudi Backside During Pradakshina

1ప్రదక్షిణ సమయంలో గర్భ గుడి వెనుక భాగాన్ని తాకకూడదు

దేవాల‌యంలో ప్ర‌ద‌క్షిణ చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనుక భాగాన్ని తాక‌కూడ‌దు!? అలా చేయడం వలన ఏమి జరుగుతుంది?

సహజంగా చాలా మంది దేవాలయాలకు వీలు కుదిరినప్పుడల్లా వెళుతుంటారు. కొంతమంది నిత్యం వెళ్ళేవారు కూడా ఉంటారు. దేవాలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా పండగల సమయంలో గానీ జాతర సమయంలో గాని వేలాది మంది భక్తులు దేవాలయాలు దర్శించుకుంటారు. చాలా మంది దేవాలయంలోకి వెళ్ళగానే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో చాలా మంది భక్తులు గర్భ గుడి వెనుక భాగాన చేతులతో తాకడం మరియు తలను గర్భ గుడి వెనుక భాగాన అనిచ్చి ప్రార్థించడం లాంటివి చేస్తుంటారు. అలా గర్భ గుడి వెనుక భాగాన్ని తాకకుడదని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని నియమాలు పాటించాలి. వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం.

ఆలయంలో ప్రదక్షిణ సమయంలో ఈ నియమాలు పాటించాలి (Need to Follow These Rules During Pradakshina in Temple)

తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని మన పండితులు చెబుతున్నారు. అలా పొరపాటున కూడా గర్భ గుడి వెనుక భాగాన్ని తాకుతు ప్రదక్షిణలు చేయకూడదు. గర్భ గుడి వెనుక భాగాన రాక్షసులు ఉంటారని పురాణాల ప్రకారం మన వేద పండితులు చెబుతున్నారు. అలా గర్భ గుడి వెనుక భాగాన తాకడం వలన రాక్షసులని నిద్రలేపినట్లు అవుతుందట. ఇలా మీరు ప్రార్థించడం వలన ప్రతికూల శక్తి యొక్క ప్రభావం మీపై అలాగే మీ యొక్క కుటుంబం పైన పడుతుందని పండితులు చెబుతున్నారు. కనుక మీరు గర్భ గుడి వెనుక వైపు తాకకండి. ప్రదక్షిణ చేసే సమయంలో గుడికి తాకుతూ ప్రదక్షిణలు చేయకండి.

ఆలయంలోకి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మన వెనుక భాగం దేవుడికి చూపించకుండా తిరిగి అలాగే వెనక్కి రావాలి. దేవుని దర్శనం అయిన వెంటనే తిరిగి వచ్చేయకూడదు. దేవాలయంలో ఒకచోట కూర్చుని దేవుని స్మరించుకోవాలి. అలా చేయడం వలన దేవుని అనుగ్రహం కలుగుతుంది మరియు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. దేవుని దర్శనం తరువాత పంతులు గారు ఇచ్చిన తీర్థం తాగి, తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఆలయంలో పొరపాట్లు చేయడం వలన పాప గ్రస్తులు అవుతారని కూడా పండితులు చెబుతున్నారు.

Spiritual Related Posts

తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi