
Vivah Panchami 2025
1దంపతుల మధ్య వివాదాలు సమసిపోవాలంటే – వివాహ పంచమి రోజున అరటి చెట్టు పూజ
వివాహ పంచమి పండుగను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలో ఐదవ తిథి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల వివాహం జరిగినట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగను శ్రీ రామ వివాహ ఉత్సవం అని కూడా అంటారు.
తులసి వివాహం, ఆదివారం, నవంబర్ 2, 2025
ద్వాదశి తిథి ప్రారంభం – నవంబర్ 02, 2025న ఉదయం 07:31
ద్వాదశి తిథి ముగుస్తుంది – నవంబర్ 03, 2025న 05:07 AM
అరటి చెట్టు పూజ ప్రాముఖ్యత (Spiritual Significance of Banana Tree Worship)
వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల దాంపత్య సమస్యలు దూరమవుతాయని నమ్మకం. ఇది దాంపత్య జీవితంలో శాంతి, సౌఖ్యం కలిగించడమే కాకుండా, బృహస్పతి గ్రహానిదీ ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుందని భావిస్తారు.
అరటి చెట్టును ఎందుకు పూజిస్తారు? (Why is the Banana Tree Worshipped?)
- ఉదయం తొందరగా లేచి తలస్నానం చేయాలి.
- పసుపు రంగు వస్త్రాలు ధరించి, అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి.
- పసుపు, చందనం, పుష్పాలతో చెట్టును అలంకరించి, ధూపం దీపారాధన చేయాలి.
- శ్రీరాముని మంత్రాలను జపిస్తూ, లక్ష్మీనారాయణుడిని ధ్యానించాలి.
- ఆ తరువాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి, కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పించాలి.
- అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
- చివరగా పెళ్లి కావలసిన వారు పెళ్లి కుదరాలని, దంపతుల మధ్య కలహాలు తగ్గాలని ప్రార్థించాలి.
- వివాహ పంచమి నాడు పెళ్లి చేయరానికి కారణం
- వివాహ పంచమి రోజున సీతారాముల వైవాహిక జీవితం ఎదుర్కొన్న సవాళ్ల కారణంగా ఈ రోజున పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రావు. కానీ, ఈ రోజున సీతాదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని, వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రాముఖ్యత (Importance According to Astrology)
బృహస్పతి గ్రహం దాంపత్య జీవితం, పిల్లలు, విద్య, సంపద, ధార్మికత వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. బృహస్పతి ప్రతికూల ప్రభావాలను దూరం చేసేందుకు అరటి చెట్టు పూజ ఉపయోగకరంగా ఉంటుంది. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల భాగస్వాముల మధ్య బంధం మధురంగా ఉంటుంది.
అందుకే ఈ పండుగను భక్తి భావంతో జరుపుకుని, దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.
ఇలాంటి మరెన్నో విషయాలు వ్యక్తిగతంగా పొందటానికి మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.
Related Posts
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra