విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ సర్వ కార్య సిద్ధి | Vishnu Sahasranama Parayanam in Telugu

0
5850
shree-vishnu-with-mata-laxmi
విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ సర్వ కార్య సిద్ధి | Vishnu Sahasranama Parayanam in Telugu

విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి.

కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది.

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును.

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం

మన నిత్య జీవితంలో ని అన్నీ సమస్యల కు పరిష్కరాలు ఇందులో వున్నాయి

 

1 సర్వ కార్య సిద్హి కి(27 వ శ్లోకం)

 

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ||

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |

2 కళ్యాణ ప్రాప్తి కి (32 వ శ్లోకం)

కామహా కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః ||

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః |

3 ఉద్యోగ ప్రాప్తి కి ( 42 వ శ్లోకం)

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |

పరర్ద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః ||

 

4 దారిద్ర్య నాశనం కొరకు మరియు ధన ప్రాప్తి. కి ( 46 వ శ్లోకం.}

అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

అనిర్విణ్ణః స్థవిష్ఠోభూర్ధర్మయూపో మహామఖః |

 

5 ఐశ్వర్య ప్రాప్తి కి (65 వ శ్లోకం )

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

6 విద్యా ప్రాప్తి కి ( 80 వ శ్లోకం )

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ||

తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః |

 

7 సంతాన ప్రాప్తి కి (90 వ శ్లోకం )

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |

అధృతస్స్వధృతస్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ||

8 సర్వ రోగ నివారణకు. ( 103 వ శ్లోకం)

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ||

9 పాపములు నశించుటకు. 106 వ శ్లోకం ),

దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ||

శంఖభృన్నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః |

10 సుఖ ప్రసవము నకు (107 వ శ్లోకం )

శంఖభృన్నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః |

రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ||

 

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here