
Vaishakha Amavasya 2025 Date & Muhurat Timings
1వైశాఖ అమావాస్య 2025
ఏప్రిల్ 27, 2025 వైశాఖ అమావాస్య వచ్చింది. హిందూ ధర్మం విశ్వాసం ప్రకారం వైశాఖ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వైశాఖ అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అతిపెద్ద దోషాల నుంచి ఉపశమనం పొందుతారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు ఆచరించి పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల దోషాల నుంచి ఉపశమనం పొందుతారు.
వైశాఖ అమావాస్య రోజున ఆచరించవలసిన నియమాలు (Rules to be Observed on Vaisakh Amavasya Day)
వైశాఖ అమావాస్య రోజున శని జన్మోత్సవం వేడుక జరుపుకుంటారు. శనిదేవుని పుట్టినరోజు సందర్భంగా పూజలు చేస్తే శని సాడే సాతి, శని దోషం నుండి ఉపశమనం పొందుతారు. శని దేవుడికి నలుపు రంగు దుస్తులు, తమలపాకులు, కొబ్బరికాయ, అగరవత్తులు, నల్ల నువ్వులు, జిల్లేడు ఆకులు, ఆవాల నూనె సమర్పించుకోవాలి. గ్రహాల ప్రత్యేక స్థితి కారణం చేత కాల సర్పదోషం ఏర్పడే అవకాశం ఉంది. సర్ప దోషం వల్ల కుటుంబ సమస్యలు అన్నింట్లో ఇబ్బంది కలిగించును, వాహన గండం, నివాస స్థల సమస్య, అన్నదమ్ములతో కలహాలు, మీ పనిలో ఆటంకం కలిగిస్తుంది. వైశాఖ అమావాస్య రోజున కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.
పితృ దోషం పెద్ద దోషంగా భావిస్తారు. పితృ దోషం అంటే పూర్వీకుల అంత్యక్రియలు శ్రద్ధగా నిర్వహించకపోవడం. పెద్దలను మరియు మహిళలను అవమానించడం వంటి కారణాల వల్ల పితృ దోషం వస్తుంది. తర్వాత తరాల వారు కూడ ఇబ్బందులకు గురవుతుందంటారు. పూర్వీకులకు వైశాఖ అమావాస్య రోజున పిండ దానం చేయడం మంచిది. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయంటారు మరియు పితృ దోషం కూడా నశిస్తుంది.