మహాకాలుడు తిరుగాడే మహిమాన్విత నగరం ఉజ్జయని | Ujjaini the city of Mahakala in Telugu

0
1638
ujjaini-the-city-of-mahakala
మహాకాలుడు తిరుగాడే మహిమాన్విత నగరం ఉజ్జయని | Ujjaini the city of Mahakala in Telugu
Back

1. అంతులేని సంపదకు ఆనవాలు

ఉజ్జయిని మహా నగరాన్ని ఒకప్పుడు స్వర్ణ శృంగ అని పిలిచేవారు. ఇక్కడి భవనాలన్నీ బంగారు గోపురాలతో ఉండేవట..! అందుకని ఆ నగరాన్ని స్వర్ణశృంగ , కనక శృంగ అని పిలిచేవారు. మన పురాణాలలో అవంతి, అవంతికా నగరం అని గొప్పగా చెప్పబడ్డది ఈ నగరం గురించే. కార్తవీర్యార్జునుడు అనే రాజు కుమారుడు అవంతి పేరుమీద ఈ నగరానికి అవంతీ నగరం అనే పేరు వచ్చింది. ఇక్కడి సంపదనూ వైభోగాలనూ చూసినవారు ఈ నగరాన్ని పద్మావతీ నగరం అని పిలిచేవారు. ఎన్నోసార్లు ధ్వంసం చేయబడ్డా ప్రతిసారీ పూర్వం కన్నా అద్భుతంగా రూపొందుతున్న కారణాన ‘ప్రతికల్ప’ అన్నారు. ఇక్కడి భోగ భాగ్యాలు, సిరి సంపదలు చూసి ‘హిరణ్యావతీ’ ‘ భోగావతీ’ అని పిలిచేవారు. ఇతర ప్రాంతాలలో అరుదుగా కనిపించే కుముద్వతి పుష్పాలు ఇక్కడ విరివిగా పూయడం వల్ల కుముద్వతీ అనీ, కుశస్థలి, అమరావతి, చూరమణి, విక్రమపురి అని ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఉజ్జయినీ మహా నగరానికి.

అసలు ఉజ్జయిని అంటే ప్రాకృతభాషలో పూలతోట అని అర్థం. సంస్కృత భాషకన్నా అతిప్రాచీనమైన ప్రాకృతభాష ఇక్కడ ఒకప్పుడు రాజభాషగా ఉండేది. అందుకనే ఆ భాషలోని ఉజ్జయిని అనే పదం ఆ నగరానికి స్థిరపడిపోయింది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here