
TTD Requesting Devotees
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుండి వస్తారు. జీవితంలో ఒక్కసరైన ఆ కలియుగ వైకుంఠనాదున్ని చూడాలి అనుకుంటారు. శ్రీ వారి దర్శనం అయితే పాపాలు పోయి జీవితం ధన్యం అవుతుంది అనుకుంటారు.
వరస సెలవులు ఉండడం వలన తిరుమలకు భక్తులు పోటెత్తారు, ఎంతాలా అంటే క్యూ లైన్లు ఔటెర్ రింగ్ రోడ్డు దాటి శిలా తోరణం వరకు కొనసాగంచారు. శ్రీ వారి టొకేన్స్ లేని వారికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది అంటే మీరే అర్ధం చేసుకొండి ఎంత జనం ఉన్నారో.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకోని టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందుబాటులో ఉంచింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం కూడ అందిస్తున్నారు.
ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే శనివారం మధ్యాహ్నానికి 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలతో పాటు ఉప్మా, పొంగల్ పంపిణీ చేశారు.
సాధారణంగా రోజు కంటే శనివారం రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందిస్తారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తిరుమలలోని క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట, అవాంచనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అధికార లేక్కల ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల వరకు 50 వేల మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
భక్తుల అధిక రద్దీ కారణంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డీ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి భక్తులు లక్ష మందికి పైగా ఒకేసారి తిరుమలకు చేరుకోవడంతో భక్తులతో పాటు సిబ్బంది కూడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Related Posts
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
https://hariome.com/ttd-reveals-annual-budget-estimations-for-year/
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!