గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

0
3826
Tirupati Gangamma Jatara
Tirupati Gangamma Jatara 2023 History, Significance

Tirupati Gangamma Jatara 2023

3తిరుపతి గంగమ్మ దేవలయం చరిత్ర (History of Tirupati Gangamma Temple)

తిరుపతి గంగమ్మను శ్రీ వెంకటేశ్వరస్వామికి సోదరిగా చెబుతూ, ఒక భక్తుడు అనంతాళ్వార్ తాతయ్యగుంటలో గంగమ్మకు ఆలయం కట్టించారని స్థల పురాణం. ఈ ఆలయానికి 900 ఏళ్ల పురాతన చరిత్ర ఉంది.

ఈ జాతరే భారత దేశంలొ జరుపుకున్న మొట్ట మొదటి జాతరగా చెబుతారు. తాతయ్య గుంటలో గంగమ్మ ఆలయం 1400 సంవత్సరాల ముందు నుంచే ఉందన్న ఆధారాలు దొరికాయి. దేవాలయాన్ని పునర్మిస్తున్న సమయంలో పల్లవుల కాలం నాటి రాతి స్తంభాలు మరియు శసనాలు బయటపడ్డాయి. ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అనుకుంటే, 1400 ఈళ్ళకు మునుపే గంగమ్మ తల్లి వెలసిందని చాలా స్పష్టమైన ఆధారాలు లభించాయి. 1100 సంవత్సరాల కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన అనంతాల స్వామి వారు గంగమ్మను మళ్లీ ప్రతిష్టించినట్టు ఆధారలు ఉన్నాయి. ఇంత ప్త్రాచీనమైన చరిత్ర ఉన్న తిరుపతి గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లిగా ప్రసిద్ది చేందింది. మొదట వెంకటేశ్వర స్వామి చెల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శంగం చేసుకున్నాకే శ్రీవారి ఆలయానికి వెళ్లే ఆచారం అప్పట్లో ఉండేది. కాలనుగునంగా ఆచారాలు కొద్దిగా బలహీనపడటం కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.