తిరుమల శ్రీవారి అభిషేకానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?! వాటి ప్రాముఖ్యత ఏమిటి?! | Srivari Abhishekam Milk Secrete

0
1364
Tirumala abishekam details
Srivari Abhishekam Milk Secrete

Tirumala Srivari Abhishekam Details

2శ్రీవారి అభిషేకాలకు వాడే పాలు ఇచ్చే ఆవులు వాటి జాతులు (The Cows That Give Milk Used For Srivari Abhishekas Are Their Species)

దేశంలో గల 14 రకాల గో జాతులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుంగనూరు, ఒంగోలు జాతులు, తమిళనాడుకు చెందిన ఉంబలాచారి, తాంగయ్యాన్, గుజరాత్ కు చెందిన గీర్, కాంక్రీజ్, పంజాబ్ కు చెందిన సాహీవాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, థార్పార్కర్, కర్ణాటకకు చెందిన హాలికర్, కేరళకి చెందిన వేచూర్ క్యాట్ జాతులతో పాటు మరికొన్ని జాతులు గల ఆవులు ఉన్నాయి.

గోసంరక్షణ శాల సంరక్షణ వివరాలు (Details of Care of Cow Sanctum Sanctorum)

ఈ ఆవులకు మంచి స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తారు. వాటికీ కావాల్సిన పోషకాలు మెండుగా ఉండేలా పచ్చ గడ్డి, ఇతర మొక్కలతో కలపిన మేతను ఆహారంగా వేస్తారు. ఈ ఆహారాన్ని పశు వైద్య నిపుణులు సూచించే ఆహారాన్నే అందిస్తారు. వయస్సు వాటి ఎత్తును బట్టి ఎంత మేరకు ఆహారం కావాలో అంత మేరకు ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం సుప్రభాత సేవ, ఏకాంత సేవలో నవనీతం ఎంతో ముఖ్యమైనది. స్వామి వారికి వినియోగించే ప్రసాదాలు అన్ని శాస్త్ర బద్దంగా మరియు స్వచ్ఛమైనదిగా ఉండాలి. గోశాలలో ఉన్న దేశవాళి గోవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన పాలు సుప్రభాతం, తోమాల, ఏకాంత సేవల్లో ఉపయోగిస్తారు. ఇక శుక్రవారం ఉదయం నిర్వహించే అభిషేక సేవకు 250 లీటర్ల పాలను ఉపయోగిస్తారు. ఆ పాలను తిరుపతి గోశాల నుంచి తిరుమలకు తీసుకెళ్తారు.

ఒక్క శుక్రవారం రోజు దాదాపుగా 500 లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఇక స్వామి వారికి నైవేధ్యంగా వినియోగించే బెల్లం పాయసం, పాల పాయసానికి ఈ పాలను ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే స్నాపన తిరుమంజనం, చక్రస్నానంకు వినియోగించే పాలు, పెరుగు తిరుపతి గోశాల నుంచే తిరుమలకు తీసుకునివెళతారు. ఇక నిత్య కైంకర్యాలల్లో వినియోగించే పెరుగు రోజుకు 150 లీటర్లు శ్రీవారు ఆలయానికి తీసుకుని వెళతారు. ఒక్క శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి ఆలయానికి సుమారు 250 లీటర్లు పాలు అవసరం అవుతాయి.

ఈ గోసంరక్షణ శాలలో విరాళం రూపంలో ఇచ్చిన ఆవులను చాలా జాగ్రత్తగా టీటీడీ చూసుకుంటుంది. దూడ ఆకలి తీరిన తరువాతే మిగిలిన పాలను శ్రీవారి కైంకర్యాలలో ఉపయోగిస్తారు. ఇలా రోజు జరిగే సేవలలో ఉపయోగిస్తారు.

Related Posts –

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే లాటరీ తగిలినట్లే! | Dream Astrology

దేవతల్లో ఇద్దరికి మాత్రమే శని పట్టలేదు! ఎవరు వారు?! Only Two of the Deities Were Not Effected by Shanidev Dosh

https://hariome.com/according-to-numerology-how-to-put-name-to-baby/

https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/

Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi

https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/

సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog

https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023

20 ఏళ్ళ పాటు శుక్ర మహా దశ! ఈ దశలో ఎవరికి ఎలా తెలుసుకోండి! | Shukra Mahadasha 2023

Next