తిరుమల శ్రీవారి అభిషేకానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?! వాటి ప్రాముఖ్యత ఏమిటి?! | Srivari Abhishekam Milk Secrete

0
1453
Tirumala abishekam details
Srivari Abhishekam Milk Secrete

Tirumala Srivari Abhishekam Details

1తిరుమల శ్రీవారి అభిషేకం పాల వివరాలు

తిరుపతి దేవస్థానంలో (Tirumala) శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాలల్లో స్వచ్ఛమైన పదార్థాలనే ఉపయోగిస్తారు. వీటిలో ముఖ్యమైనది గోవుపాలు. శ్రీవారి అబిషేకంలో స్వచ్ఛమైన గోవు పాలను మాత్రమే ఉపయోగిస్తారు. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాల జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు, స్వామి వారి అభిషేకాల నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గోసంరక్షణ శాలను నిర్మించారు. తిరుపతి- చంద్రగిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గోసంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికి నిత్య సేవలైన సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గోసంరక్షణ శాల ఎగుమతి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఎగుమతి చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back