అరచేతిలోని తీర్థాలు| How to take Thertham

0
587

How to take Therthamఅగ్నిపురాణంలో మన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.

కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని

“ఓమ్ కేశవాయస్వాహా, ”
“ఓమ్ నారాయణాయస్వాహా, ”
“ఓమ్ మాధవాయస్వాహా “,

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.

  • చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే బ్రహ్మతీర్థం అని అంటారు. 
  • చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.
  • అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 
  • చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.
  • ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.

ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.

సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. 
పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం పితృతీర్థం అనబడుతున్నది.

ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

తీర్థం ఎలా తీసుకోవాలి? | how to take theertham in temple in Telugu