అయ్యప్ప దీక్ష వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం

1
1374

పల్లెలు, పట్టణాల్లో అయ్యప్ప స్వాముల సందడి నెలకొంది. చెడు వ్యసనాలకు దూరంగా నిత్యం దైవ నామస్మరణ చేస్తూ క్రమశిక్షణతో భక్తులు ఆధ్యాత్మిక చింతనతో అయ్యప్పను స్మరిస్తున్నారు. భక్తులు లక్షల్లో భక్తులు అయ్యప్ప దీక్షను తీసుకొని 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి ఇరుముడి కట్టుకొని శబరియాత్రకు బయలుదేరి వెళ్తారు. గురుస్వామి ద్వారా మెడలో అయ్యప్పమాలను ధరించిన వ్యక్తులు, దీక్షా నియమాలు పాటిస్తే కలిగే ఆరోగ్యం, మోక్షంపై ‘ఈనాడు’ కథనం.

* మానసిక ఒత్తిడిని తీసి, ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతతను పొందడానికి యువత ఎక్కువగా మాల ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురుస్వామి ద్వారా మెడలో అయ్యప్పబిళ్ల ఉన్న తులసి, రుద్రాక్ష మాలలు శరీరానికి తగలడం వల్ల వ్యాధులు దరి చేరవంటారు. దీక్షలో బ్రహ్మచర్య వ్రతానికి ప్రాధాన్యం ఉంటుంది.

* దీక్ష పూర్తి చేసిన భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇరుముడి కట్టుకొని యాత్రకు బయలుదేరి శబరి సన్నిధానంలో ఉన్న పద్దునెట్టంబడి(18 మెట్లు) ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.

అయ్యప్ప దీక్షా నియమావళిలో నిత్యం తీసుకునే సాత్విక ఆహారం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. స్వాములు ఒక పూట భోజనం, రెండో పూట అల్పాహారం నియమబద్ధంగా తీసుకోవడం వల్ల శరీరం తేలికవుతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిత్యం జరిగే భజన కార్యక్రమాలలో రెండు అరచేతులతో చప్పట్లు కొట్టడం వల్ల చేతుల్లోని నరాల్లో రక్తప్రసరణ బాగా జరిగి తెలియని ఆనందాన్ని పొందుతారు.

2. వెళ్లలేని వారికి ఉపశమనం..: 

కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోలేని వారికి ఆంధ్రలో ప్రముఖ దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలోని ద్వారపూడిలో అయ్యప్ప దేవాలయం ఉంది. దీనినే ఆంధ్ర శబరిమల అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతం విజయవాడ నుంచి 169 కి.మీ దూరంలో ఉంటుంది.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here