
Retirement Of A Carpenter
మన వ్యక్తిత్వానికి మన మాటల కన్నా చేతలే నిజమైన సాక్ష్యాలు. చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి అంకిత భావంతో చేయాలనే గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం.
3. నాసిరకం పనికి ఫలితం
తెల్లవారి ఉదయం కిష్టయ్య యజమాని అతని ఇంటికి వచ్చి ఒక తాళం చెవిని కిష్టయ్యకు ఇచ్చాడు. ఇదేమిటని కిష్టయ్య అడగగా ఆ యజమాని ‘ నీవు చివరిగా పనిచేసిన ఇల్లు నీదే కిష్టాయ్యా.. ఇన్ని రోజులు నువ్వు నా వద్ద పనిచేసినందుకు నీకు బహుమతిగా ఆ ఇంటిని కట్టించాను. నీవైతేనే ఆ ఇంటికి వడ్రంగి పని చక్కగా చేయగలవని నిన్నే పురమాయించాను.’ అన్నాడు. కిష్టయ్యకు నోట మాట రాలేదు. తాను అయిష్టంగా నాసిరకంగా కట్టింది తన ఇంటినేనా అని తలచుకుని బాధపడ్డాడు. పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని గ్రహించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Promoted Content