
3. వివేకానందుని తల్లి ఆయనను ఎలా పరీక్షించింది?
వివేకానందుడు మొదటి విదేశీ పర్యటకు ముందు తన తల్లిని దర్శించుకున్నాడు. ఆమె చేతి వంటను సంతృప్తిగా భుజించాడు. కమ్మని వంటనూ, అమ్మ ప్రేమనూ ఆస్వాదించాడు. భోజనం చేసిన తరువాత ఆమె వివేకానందుని చేతికి కొన్ని పళ్ళనూ వాటిని కోసుకుని తినడానికి ఒక చాకునీ ఇచ్చింది. ఆయన తినడం పూర్తవగానే చాకుని అందించమని అడిగింది. ఆయన తన దగ్గర ఉన్న ఆ చాకుని తల్లి చేతికి అందించాడు. అప్పుడామె “కుమారా నువ్వు నా పరీక్షలో నేగ్గావు. ఇక నిరభ్యంతరంగా హిందూధర్మ ప్రచారం కోసం విదేశాలకు వెళ్ళు” అంది. ఆమె పెట్టిన పరీక్ష ఏమిటో తాను ఎలా గెలిచాడో కూడా వివేకానందునికి అర్థం కాలేదు.
Promoted Content








Super story sir. ..
good moral..
keep it continue….