
మహా భారతం లో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానం లోనిది.
భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం(శుభ్రత) యొక్క అవసరాన్ని చాటిచెబుతుంది.
4. రాణి ఉదంకునికి ఎందుకు కనబడలేదు?
ఉదంకుని మాటలకు రాజు ఇలా సమాధానమిచ్చాడు. ‘మహానుభావా..! నీ వంటి జ్ఞానులకు నేను చెప్పదగిన వాడను కాను.
పరమ పావని, పతివ్రత అయిన పట్టపురాణి అశుద్ధముగా ఉన్న వారికి కనపడదు. అశౌచం గా ఉన్న సమయం లో ఉత్తముల దర్శనం అసాధ్యం కదా..!’
అన్నాడు. అప్పుడు ఉదంకునికి తాను చేసిన తప్పిదం గుర్తుకు వచ్చింది. అడవిలో దివ్య పురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని తిన్న తరువాత ఉదంకుడు ఆచమనం చేయలేదు.
అతను అపరిశుభ్రంగా ఉండటం వల్ల రాణి దర్శనభాగ్యం కలుగలేదు. వెంటనే ఉదంకుడు ఆచమనం చేసి పరిశుద్ధుడై రాణి మందిరానికి వెళ్ళగా ఆమె అక్కడే ఉంది.
తరువాత ఆమె సంతోషంగా గురుపత్నికి తన కుండలాలను సమర్పించింది.