
మహా భారతం లో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానం లోనిది.
భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం(శుభ్రత) యొక్క అవసరాన్ని చాటిచెబుతుంది.
1. ఉదంకునికి గురుపత్ని ఆదేశం
ఉదంకుడు పైల మహర్షి శిష్యులలో అగ్రగణ్యుడు. ప్రతిభావంతుడు. ఉదంకుడు అణిమాది సిద్ధులను సాధించినవాడు.
బ్రహ్మ తేజముతో వెలిగిపోయే వాడు. ఎంతటి జ్ఞాని అయినా తన గురువు పట్ల ఎల్లప్పుడు వినయ విధేయతలతో ఉండేవాడు.
ఒకనాడు ఉదంకుని గురుపత్ని అతనికి ఒక కార్యాన్ని అప్పగించింది. తాను ఒక వ్రతం చేయదలచుకున్నాననీ అందుకు ఆ దేశరాజు, ధర్మాత్ముడు అయిన పౌష్యుని ధర్మపత్ని యొక్క కుండలాలు తెచ్చిపెట్టమని అడిగింది. ఉదంకుడు ఆమె ఆజ్ఞానుసారం రాజధానికి బయలుదేరాడు.
Promoted Content