
మహా భారతం లో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానం లోనిది.
భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం(శుభ్రత) యొక్క అవసరాన్ని చాటిచెబుతుంది.
3. పౌష్య రాజు ధర్మపత్ని
రాజధానికి చేరుకున్న ఉదంకుడు పౌష్యరాజును కలిసి తన గురుపత్ని ఆకాంక్షను గురించి తెలిపాడు. ఉదంకుని సాదరంగా ఆహ్వానించిన పౌష్యుడు అతని కోరికని ఆనందంగా ఆమోదించాడు.
మహారాణి దర్శనం చేసుకుని ఆమెకు ఈ విషయాన్ని చెప్పమనీ ఆమె సంతోషంగా కుండలాలను ఇస్తుందనీ చెప్పాడు.
ఉదంకుడు రాజు అనుమతితో రాణి మందిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ రాణి కనిపించలేదు. ఉదంకుడు రాజుకు విషయాన్ని విన్నవించి, ఆయననే రాణి వద్దనుండి ఆమె కుండలాలను తెచ్చి ఇవ్వమని ప్రార్థించాడు.
Promoted Content