
మహా భారతం లో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానం లోనిది.
భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం(శుభ్రత) యొక్క అవసరాన్ని చాటిచెబుతుంది.
2. అరణ్య మార్గం లో ఉదంకుని దివ్యానుభవం
అరణ్యమార్గం గుండా రాజధానికి బయలు దేరిన ఉదంకునికి అడవిలో వృషభాన్ని అధిరోహించిన ఒక దివ్యపురుషుడు కనిపించాడు.
కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్న అతనిని సమీపించి ఉదంకుడు భక్తితో నమస్కరించాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి ప్రసాదాన్ని ఇచ్చి భుజించమన్నాడు.
ఉదంకుడు ఆ దివ్య పురుషుడిచ్చిన ప్రసాదాన్ని భుజించి అమితానందంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
Promoted Content