
2. విఠలుని పరీక్ష
ఆమె భక్తిని సత్ప్రవర్తనని చూసి సంతోషించిన విఠలుడు శ్రీనివాసునికి సద్బుద్ధిని కలిగించాలని అనుకున్నాడు. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యమో, సరస్వతీ బాయి పూజా ఫలితమో పరమాత్ముడైన ఆ విఠలుడు వారిని కరుణించాడు.
బ్రాహ్మణ వేషధారియై శ్రీనివాసనాయకుని వద్దకు వచ్చి ధర్మం చేయమని అడిగాడు. సాక్షాత్తూ లక్ష్మీ పతే ఆ పిసినారి వ్యాపారిని దానం అడగటం లీలా మాత్రంగా జరిగింది.
కానీ ఆ వ్యాపారి బ్రాహ్మణ వేషం లోని విఠలుని ఈసడించుకుని పంపించి వేశాడు. భక్తుల కొరకు ఎంతటి స్థితినైనా భరించే ఆ పరమాత్ముడు శ్రీనివాసనాయకుని బుద్ధి మారకపోతుందా అని అనేక కష్టాలకొర్చి పదే పదే అతనిని యాచించసాగాడు.
Promoted Content