
3. చిన్న పుణ్యకార్యానికైనా చక్కటి ప్రతిఫలం
భక్తరక్షకుడైన పరమేశ్వరుడు కుబేరుడి కోసం అలకాపరిని అందంగా తీర్చిదిద్దమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ అనేకానేక సౌకర్యాలతో ఉన్న భవనాలతో, అందమైన వనాలతో విరాజిల్లే అలకాపురి నగరాన్ని కుబేరుడి కోసం సిద్ధం చేశాడు. శివుడు తన భక్తుడికి మరింత మేలు చేయాలని ఉత్తర దిక్కుకు అధిపతిగా కూడా కుబేరుడిని నియమించాడు. అలా కుబేరుడు దిక్పాలకుడయ్యాడు. ఇలా ఈ కధా సందర్భంలో దైవభక్తిపరమైన అంశాలతోపాటు రెండు సామాజిక చైతన్య అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకరిని చూసి అసూయ చెందితే నష్టం కలగటం తప్పని సరి. ఒక వేళ పుణ్యం బాగుండి బయటపడ్డా ఆ నష్టానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆ మనిషిని వెంటాడు తూనే ఉంటాయి. కనుక ప్రతి మనిషీ తన ప్రధాన శత్రువైన అసూయను దూరంగా ఉంచాలి. దానితోపాటు నిర్మలమైన మనసుతో ఉపవాసం ఉండి శివాలయంలో శివుడి ముందు ఓ చిరుదివ్వెను వెలిగించినా అది ఎన్నెన్నో జన్మలకు సరిపోయినంత దైవానుగ్రహాన్ని పుణ్యాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఇలాంటి సందేశాలు శివపురా ణంలోని ఈ కథలో కనిపిస్తున్నాయి.
సేకరణ – డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారు








Wonderful story ! 🙂
Thanks for sharing…
THQ sir asuyaku Manchi udaharana chupincharu
THQ sir asuyaku Manchi udaharana chupincharu
Nice story…thank you for sharing
nice god storys……