కుబేరుడికి అంత సంపదలెలా దక్కాయి?

5
13369

2. అసూయచెందితే నష్టం తప్పదు

వైశ్రవణుడి తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. అయితే పరమేశ్వరుడిని వైశ్రవణుడు చూడలేకపోయాడు. దానికి కారణం ఈశ్వరుడు అమితమైన కాంతితో ఉండటమే. అదే విషయాన్ని శివుడికి చెప్పి తనకు శివపాదాలను దర్శించుకొనేందుకు తగినంత కంటి చూపును ఇమ్మన్నాడు వైశ్రవణుడు. శివుడు అనుగ్రహించాడు. అయితే వైశ్రవణుడు శివుడి పక్కన ఉన్న అమ్మవారిని చూసి అసూయచెందాడు. నిరంతరం శివుడిని ఆనుకొని ఉంటున్న

ఆమె భాగ్యాన్ని తలచుకొని కుటిలంగా ఆమె వంక చూశాడు. దాంతో ఆ తల్లి కోపగించి వైశ్రవణుడు ఏ కంటితో అసూయగా తనను చూశాడో ఆ కన్ను పోతుందని శపించింది. వైశ్రవణుడు మళ్లీ శివుడిని ప్రార్ధించటంతో శివుడు పార్వతికి నచ్చచెప్పాడు. అప్పడా తల్లి ఆనాటి నుంచి తెల్లగా ఉన్న అతడి కన్ను కమిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుందని ఈ కారణం చేతనే కురూపిగా ఉన్న అతడిని కుబేరుడు అని అందరూ పిలుస్తారని చెప్పింది. అసూయ అనేది ఎలాంటి వారికైనా సరే ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వటానికే తానలా చేస్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత శంకరుడు కుబేరుడిని ఆశీర్వదిస్తూ ఆనాటినుంచి అతడిని నవనిధులకు అధినాధుడిగా చేశాడు. అంతేకాక గుహ్యకులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు లాంటి వారందరికీ కూడా కుబేరుడే అధిపతి అని, తన కైలాసానికి సమీపంగా ఉండే అలకానగరం అతడికి రాజధాని అవుతుందని, కనుక అలకానగరానికి రమ్మని అక్కడ కుబేరుడికి అధికారాన్ని అప్పగిస్తానని చెప్పి పార్వతితో సహా శివుడు అంతర్గానమయ్యాడు.

Promoted Content

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here