
Story of Hanuman Chalisa in Telugu
3. తులసీ దాసుకు జైలు శిక్ష
రామ నామ మహిమ కనులారా చూసిన జనం రామభక్తులుగా మారారు. వారి సంఖ్య నానాటికీ పెరగసాగింది. స్వయంగా పరమత సహనాన్ని కలిగి ఉన్న అక్బర్ పాదుషా చెప్పుడు మాటలను విని తులసీదాసును అదుపులోకి తీసుకోమని ఆజ్ఞలు జారీచేశాడు. తులసీ దాసును మర్యాదా పూర్వకంగా సభకు తీసుకువచ్చారు. రామనామ మహిమతో చనిపోయిన వారిని బ్రతికించారని విన్నాము. అదే మహిమను మాముందు చూపమని ఒక శవాన్ని తెప్పించాడు అక్బర్ పాదుషా. జనన మరణాలను తాను తప్పించలేనని ఆ శవాన్ని బ్రతికించలేనని అన్నాడు తులసీ దాసు. రాజధిక్కార నేరం కింద తులసీ దాసును చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టారు రాజభటులు.
Promoted Content