వెలిగే స్ఫూర్తి-ధృవ నక్షత్రం (ఈ రోజు కథ) | Story of Dhruva Nakshatra in Telugu

0
10828
Story of Dhruva Nakshatra
వెలిగే స్ఫూర్తి-ధృవ నక్షత్రం (ఈ రోజు కథ) | Story of Dhruva Nakshatra in Telugu

Moral of the Story of Dhruva

5. ధృవుని పట్టుదల (Perseverance of the Pole)

మహా మహా మునులకు, యోగులకు సైతం అసాధ్యమనిపించే విధంగా ధృవుడు కఠోరమైన తపస్సును ఆచరించాడు.

ముక్కుపచ్చలారని పసివాని పట్టుదలని, భక్తి ప్రపత్తులని చూసి ఆ నారాయణుని మనసుకరిగింది. ధృవుని తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యాడు.

ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ధృవుడు తన తల్లి పట్టపురాణి కావాలనీ, ఆమె తన భర్త ప్రేమదరాలను పొంది సుఖంగా జీవించాలనీ కోరుకున్నాడు.

ధృవుని మాతృభక్తికి సంతోషించిన నారాయణుడు అడిగిన వరాలిచ్చి, అతనిని కొన్ని వేల సంవత్సరాల పాటు భూమండలాన్ని పాలించమని, జన్మాంతంలో ధృవతారగా ఆకాశం లో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలుగొందమనీ దీవించాడు.

స్వామి వరం ప్రకారం ధృవుని తల్లి పట్టపు రాణి అయింది. ధృవుడు కొన్ని వేల సంవత్సరాలపాటు భూవిని పరిపాలించి, ధృవ నక్షత్రమై నిలిచాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here