
Moral of the Story of Dhruva
4. ధృవుడు ఎక్కడికి వెళ్ళాడు (Where Did Dhruva Go?)
తల్లికి తనకు జరిగిన పరాభవాన్ని భరించలేని ధృవుడు ఎలాగైనా తన తల్లిని పట్టపురాణిగా తిరిగి ఆ రాజభవంతిలో చూడాలని, ఆమె తాను కోల్పోయిన రాజభోగాలనూ, భర్త ఆదరణనూ మళ్ళీ పొందేలా చేయాలనీ బలంగా కోరుకున్నాడు.
ఏమి చేయాలో తోచని ధృవునికి ఆయన తల్లి ‘కుమారా..! ఎవరిపైనో పగ సాధించాలనుకునే బదులు భగవంతుని ధ్యానించు ఆయనే నీకు రక్ష.
సత్యాసత్యాలనూ, న్యాయాన్యాయాలనూ గుర్తెరిగిన ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించు. నీకు శాంతి కలుగుతుంది.’ అని చెప్పింది.
తల్లిమాటే వేదంగా తలచే ధృవుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు. అతని సంకల్ప బలం వల్ల నారద ముని అతనికి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు.
Promoted Content