పట్టణ సంస్కృతిలో పడి పశువుల పట్ల ప్రేమను, వాటితో ఉండే అనుబంధం చాలామంది చవిచూడరు. కుక్కలు, పిల్లులు వంటి జంతువుల పెంపకం కొంతవరకు మనుషులకి జంతువుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఆవులు, ఎడ్లు, మేకలు వంటి జంతువుల పోషణ,పెంపకం ఉన్న పల్లెటూళ్లలో వారు పాడిని, పశువులను ఇంట్లో సభ్యులుగా, దేవతలుగా భావిస్తారు. అలా తన ఎడ్లను కన్నకొడుకుల్లా భావించిన ఒక రైతుకథ తెలుసుకుందాం.
3. దొంగల చేతిలో రామయ్య ఎడ్లు
దొంగలు రామయ్య ఎడ్లను ఒక బండికి కట్టి పారిపోవడం రామయ్య, రక్షక భటులూ చూశారు. రామయ్య సంతోషానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. రక్షక భటులు ఆ ఎడ్లను విడిపించడానికి గుర్రాలపై దొంగలు నడుపుతున్న ఎడ్లబండిని వెంబడించారు. ఒక్క క్షణం లో ఎడ్లబండి వారికి దొరుకుతుందనగా రామయ్య వెంటనే ‘ముక్కుతాటిని రెండుసార్లు లాగండిరా’ అని దొంగలకు చెప్పాడు. వారు ఆపని చేయగానే ఎడ్లు వాయువేగంతో దూసుకువెళ్ళాయి. చూస్తుండగానే రక్షకభటుల కనుచూపుమేరను దాటేశాయి. ఈ దృశ్యం చూసి రామయ్య గర్వంగా వెనుదిరిగాడు. అయోమయంతో భటులు రామయ్య వద్దకు వెళ్లారు.