‘హ‌రివ‌రాస‌నం’ పాట ఎలా పుట్టింది? | Story Behind Arivarasanam Song in Telugu

0
1770
‘హ‌రివ‌రాస‌నం’ పాట ఎలా పుట్టింది? | Story Behind Arivarasanam Song in Telugu

అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యెసుదాసు పాడిన పాట. అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు. ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు. శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…? మొదటగా ఎవరు పాడారు..? శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది.?అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ..ఇతర పూజా కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఆలపిస్తుంటారు. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్నికుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట.

1940-50 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తుండేవాడట. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పటిస్తుండేవారట. అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి  స్వామివారికి పూజలు చేస్తుండే వారట. తర్వాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాక అతను మరణించాడని తెలుసుకుని తీవ్రంగా బాధపడి దుఃఖించిన ఈశ్వర్ నంభుద్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివారట. అప్పటి నుంచి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here